Cat Bite: పెంపుడు పిల్లి కొరకడంతో వ్యక్తి మృతి.. డాక్టర్లు 15 ఆపరేషన్లు చేసినా దక్కని ప్రాణం
ఇంట్లో ముద్దుగా పెంచుకున్న పెంపుడు పిల్లి పొరబాటున కొరకడంతో ఓ వ్యక్తి మరణించాడు. దాదాపు 15 ఆపరేషన్లు చేసిన తర్వాత కూడా వైద్యులు అతన్ని బతికించలేకపోయారు. వివరాల్లోకెళ్తే..
ఇంట్లో ముద్దుగా పెంచుకున్న పెంపుడు పిల్లి పొరబాటున కొరకడంతో ఓ వ్యక్తి మరణించాడు. దాదాపు 15 ఆపరేషన్లు చేసిన తర్వాత కూడా వైద్యులు అతన్ని బతికించలేకపోయారు. వివరాల్లోకెళ్తే..
డెన్మార్క్‌కు చెందిన హెన్రిచ్ క్రీగ్‌బామ్ ప్లాట్‌నర్ (33) అనే వ్యక్తి 2018లో ఒక పిల్లి, దాని పిల్లులను పెంచుకునేందుకు తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ పిల్లిపిల్లల సంరక్షణ సమయంలో పిల్లిపిల్ల హెన్రిక్ వేలు కొరికింది. ఐతే హెన్రిచ్ ఆ గాయాన్ని పెద్దగా పెట్టించుకోలేదు. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత అతని వేలు బాగా వాచిపోయింది. దీంతో హెన్రిచ్ డెన్మార్క్‌లోని కోడింగ్ ఆసుపత్రికి చెందిన వైద్యులను సంప్రదించాడు. వైద్యుల సిఫార్సు మేరకు ఆసుపత్రిలో చేరాడు. నిజానికి హెన్రిచ్‌కు మాంసం కొరుక్కుతినే బ్యాక్టీరియా సోకింది. అక్కడే నెల రోజులపాటు వైద్యులు ట్రీట్‌మెంట్ అందించారు. ఈ క్రమంలో అతన్ని కాపాడేందుకు డాక్టర్లు దాదాపు 15 ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్లు జరిగిన నాలుగు నెలలు గడిచినా హెన్రిచ్ వేలు సాధారణ స్థితికిరాలేదు. దీంతో డాక్టర్లు ఆ భాగాన్ని తొలగించారు. ఆ తర్వాత హెన్రిచ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. మృత్యువుతో పోరాడి ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే హెన్రిచ్ మృత్యువాత పడ్డాడు.
‘Don’t take any chances’. Danish man, 33, dies from pet cat bite 4yrs later https://t.co/XWxHMINsna #Henrik Kriegbaum Plettner #Denmark #cat bite #flesh eating bacteria #necrotizing fasciitis pic.twitter.com/LRxEwnigbu
— Scallywagandvagabond (@ScallywagNYC) December 15, 2022
ఈ సంఘటనపై హెన్రిచ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. హెన్రిచ్‌కు ఇదివరకే న్యుమోనియా, గౌట్, డయాబెటిస్ వ్యాధులు కూడా ఉన్నాయి. పిల్లి కాటు నా కొడుకు రోగనిరోధక వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపించింది. మృతుడి భార్య మాట్లాడుతూ.. చివరి శ్వాసవరకు నా భర్త ఎంతో వేధన అనుభవించాడు. నా భర్తలా మరెవరూ చనిపోవడం మాకు ఇష్టం లేదన్నారు. ఎప్పుడైనా పిల్లి వల్ల గాయం అయితే తేలికగా తీసుకోవద్దని అతని కుటుంబం విజ్ఞప్తి చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.