- Telugu News Photo Gallery Viral photos Early Cardiac Arrest Symptoms: These are Warning Signs of Cardiac Arrest
Cardiac Arrest Signs: కార్డియాక్ అరెస్ట్‌కు అరగంట ముందు కనిపించే సంకేతాలు ఇవే.. అశ్రద్ధ చేస్తే అంతేసంగతులు..
హఠాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలి మరణించడం (కార్డియాక్ అరెస్ట్) వంటి కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుండెపోటును కొన్ని రకాలైన సంకేతాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. అవేంటంటే..
Updated on: Dec 15, 2022 | 11:07 AM

హఠాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలి మరణించడం (కార్డియాక్ అరెస్ట్) వంటి కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. గుండెపోటును కొన్ని రకాలైన సంకేతాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చని అంటున్నారు. అవేంటంటే..

గుండె పోటు వచ్చే అరగంట లేదా అంతకంటే ముందు ఛాతీలో నొప్పి మొదలవుతుంది.

సాధారణంగా ఎడమ చేతివైపు నొప్పి వస్తుంది. వెనువెంటనే విపరీతంగా చెమటలు పడతాయి. కడుపులో గ్యాస్ పెరిగినట్లు, ఛాతిపై ఒత్తిడి పేరుకున్నట్లు, గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్లు ఉంటుంది. ఆ తర్వాత శరీరం స్వాధీనం తప్పినట్లు, అలసటగా అనిపిస్తుంది. గుండె నుంచి వెన్నువైపుగా నొప్పి కదులుతున్నట్లు అనిపిస్తుంది. దీన్ని నడుం నొప్పిగా భావించకూడదు. వెంటనే ఈ లక్షణాలను మనం గుర్తించకపోతే గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది

ఇటువంటి గుండెపోటు వచ్చే వారిలో కేవలం 3 నుంచి 8 శాతం మంది మాత్రమే బతికి బయటపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ఒకవేళ మీ కుటుంబంలో ఎవరికైనా 30 లేదా 40ల వయసులో ఒక్కసారిగా గుండె పోటుతో మరణిస్తే. వెంటనే కుటుంబంలో మిగతా అందరూ హృద్రోగ పరీక్షలు చేయించుకోవడం మరచిపోకూడదు.




