TSPSC Group-1 Results 2022: తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలకు తొలగిన న్యాయపరమైన చిక్కులు.. త్వరలోనే ఫలితాల వెల్లడి..

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి కమిషన్‌ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్‌ 1 ఫలితాల వెల్లడికి సంబంధించిన న్యాయపరమై వివాదం హైకోర్టులో పరిష్కారమైందని, త్వరలోనే ఫలితాలు వెల్లడిస్తామని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌..

TSPSC Group-1 Results 2022: తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలకు తొలగిన న్యాయపరమైన చిక్కులు.. త్వరలోనే ఫలితాల వెల్లడి..
TSPSC Group-1 Results 2022
Follow us

|

Updated on: Dec 16, 2022 | 8:36 AM

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి కమిషన్‌ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్‌ 1 ఫలితాల వెల్లడికి సంబంధించిన న్యాయపరమై వివాదం హైకోర్టులో పరిష్కారమైందని, త్వరలోనే ఫలితాలు వెల్లడిస్తామని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ బుధవారం (డిసెంబర్‌ 14) తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీని డిసెంబ‌రు 14న‌ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం లక్ష ఉద్యోగాలు నోటిఫికేషన్‌ దశలో ఉన్నాయి. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా తెలంగాణ సర్కార్‌ చేసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మన ఉద్యోగాలు దక్కించుకోవడానికి వీలులేకుండా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. సీఎం కేసీఆర్‌ కృషితోనే ఇదంతా సాధ్యమైందని సీఎస్‌ అన్నారు.

కాగా 503 గ్రూప్‌ 1 పోస్టులకు అక్టోబర్‌ 16న నిర్వహించని ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఫలితాలు టీఎస్‌పీఎస్సీ మరో వారం రెండు వారాల్లో విడుదల చేయనుంది. ఈ పరీక్షకు 2,85,916 మంది అభ్యర్థులు హాజరుకాగా, వీరి ఓఎంఆర్‌ పత్రాల ఇమేజింగ్‌ కూడా ఇప్పటికే పూర్తి చేసింది. తుది ఆన్సర్‌ ‘కీ’ కూడా విడుదలైన విషయం తెలిసిందే. తదుపరి దశ అయిన మెయిన్‌ పరీక్షకు వీరిలో 25 వేల మంది ఎంపికయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles