TS Govt Jobs: తెలంగాణలో 1500 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నో ఎగ్జాం.. నేటితో ముగుస్తున్న ఇంటర్వ్యూలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత 'కంటి వెలుగు' అవసరమయ్యే సిబ్బంది కోసం ప్రత్యేక నియామకాల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో.. ఔట్‌సోర్సింగ్ విధానంలో 1500 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ ఇంటర్వ్యూలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత ‘కంటి వెలుగు’ అవసరమయ్యే సిబ్బంది కోసం ప్రత్యేక నియామకాల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో.. ఔట్‌సోర్సింగ్ విధానంలో 1500 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఎంపికైన అభ్యర్థుల ఐదు నెలల పాటు ఆయా జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేన డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్‌లలో డిప్లొమా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్లుగా రెండేళ్ల పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాథాన్యత ఉంటుంది. అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగినవారు డిసెంబర్ 16 తేదీన కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. అకడమిక్ మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. తుది మెరిట్‌లిస్ట్ డిసెంబర్ 17న వెల్లడిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.19,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు…
- ఆదిలాబాద్ లో ఖాళీలు: 33
- భద్రాద్రి కొత్తగూడెంలో ఖాళీలు: 48
- హనుమకొండలో ఖాళీలు: 45
- హైదరాబాద్ లో ఖాళీలు: 124
- జగిత్యాలలో ఖాళీలు: 46
- జనగామలో ఖాళీలు: 26
- జయశంకర్ భూపాలపల్లిలో ఖాళీలు: 25
- జోగులాంబ గద్వాలలో ఖాళీలు: 25
- కామారెడ్డిలో ఖాళీలు: 44
- కరీంనగర్ లో ఖాళీలు: 48
- ఖమ్మంలో ఖాళీలు: 55
- కుమురంభీం ఆసిఫాబాద్‌లో ఖాళీలు: 26
- మహబూబాబాద్‌లో ఖాళీలు: 38
- మహబూబ్ నగర్‌లో ఖాళీలు: 45
- మంచిర్యాలలో ఖాళీలు: 40
- మెదక్ లో ఖాళీలు: 40
- మేడ్చల్ మల్కాజిగిరిలో ఖాళీలు: 75
- ములుగులో ఖాళీలు: 20
- నాగర్ కర్నూల్లో ఖాళీలు: 50
- నల్గొండలో ఖాళీలు: 74
- నారాయణపేటలో ఖాళీలు: 24
- నిర్మల్లో ఖాళీలు: 32
- నిజామాబాద్లో ఖాళీలు: 70
- పెద్దపల్లిలో ఖాళీలు: 34
- రాజన్న సిరిసిల్లలో ఖాళీలు: 26
- రంగారెడ్డిలో ఖాళీలు: 75
- సంగారెడ్డిలో ఖాళీలు: 69
- సిద్దిపేటలో ఖాళీలు: 45
- సూర్యాపేటలో ఖాళీలు: 50
- వికారాబాద్లో ఖాళీలు: 42
- వనపర్తిలో ఖాళీలు: 28
- వరంగల్‌లో ఖాళీలు: 44
- యాదాద్రి భువనగిరిలో ఖాళీలు: 34
అడ్రస్..
సంబంధింత జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్ కార్యాలయాలు/ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయాలు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.