AP CDPO Vacancies: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సీడీపీవో పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలి: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 61 సీడీపీవో పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి గురువారం (డిసెంబర్ 15) ఆదేశించారు..
ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 61 సీడీపీవో పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి గురువారం (డిసెంబర్ 15) ఆదేశించారు. వీటి నియామకాలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మహిళాశిశు సంక్షేమశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఈ మేరకు మాట్లాడుతూ..
‘అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి. నాడు-నేడు కింద చేపడుతున్న పనులను వేగవంతం చేయాలి. పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాల్లో నాణ్యత పెరగాలి. కరికులమ్ కూడా మారాలి. పాఠ్యప్రణాళిక మార్పు కోసం అవసరమైతే ప్రత్యేక అధికారిని నియమించాలి. కొత్తగా నియమించిన సూపర్‌వైజర్ల సహాయంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి. సూపర్‌వైజర్ సిస్టం ద్వారా అంగన్‌వాడీల నాణ్యత పెరుగుతుంది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, మహిళాశిశు సంక్షేమశాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సిబ్బంది నియామకాలు సహా ఏ రకమైన అవసరమున్నా ప్రభుత్వం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఫలితాలు కూడా అదేవిధంగా ఉండాలని’ ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.