TSPSC: మళ్లీ భారీగా పెరిగిన తెలంగాణ గ్రూప్‌ 2, 3 ఖాళీల సంఖ్య.. మరో పది రోజుల్లో నోటిఫికేషన్ల జారీ.

తెలంగాణలో గ్రూప్‌-2, 3 ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మరికొన్ని పోస్టులను చేర్చడంతో తాజాగా వాటి సంఖ్య మరోమారు పెరగనుంది..

TSPSC: మళ్లీ భారీగా పెరిగిన తెలంగాణ గ్రూప్‌ 2, 3 ఖాళీల సంఖ్య.. మరో పది రోజుల్లో నోటిఫికేషన్ల జారీ.
TSPSC
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 16, 2022 | 7:22 AM

తెలంగాణలో గ్రూప్‌-2, 3 ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మరికొన్ని పోస్టులను చేర్చడంతో తాజాగా వాటి సంఖ్య మరోమారు పెరగనుంది. దాదాపు 120 వరకు కొత్తగా పోస్టులు కలపడంతో గ్రూప్‌ 2 కింద మొత్తం 783 పోస్టులకు ప్రకటన వెలువడనుంది. అటు గ్రూప్‌ 3లో కూడా కొత్తగా పోస్టులను చేర్చనున్నారు.

ఇప్పటికే గ్రూప్‌-2 కింద 663, గ్రూప్‌-3 కింద 1,373 పోస్టులను గుర్తించిన కమిషన్‌.. అదనంగా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చింది. గ్రూప్‌ 2 కింద సంక్షేమశాఖలో అసిస్టెంట్‌ వెల్ఫేర్ ఆఫీసర్‌ పోస్టులు 43 వరకు, శిశు సంక్షేమశాఖలో 11 జిల్లా ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వశాఖల్లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు కలిపి మొత్తం100 వరకు పోస్టులు పెరగనున్నాయి. గ్రూప్‌ 3లో కూడా వివిధ విభాగాల్లో సీనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అకౌంటెంట్, జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అకౌంటెంట్‌తో పాటు ఇతర ఉద్యోగాల్ని చేర్చనుంది. దీంతో మొదట అనుమతించిన 1,373 పోస్టులకు అదనంగా మరిన్ని పోస్టులు పెరగనున్నాయి. ఇక కొత్తగా చేర్చబోతున్న పోస్టులతో కలిపి నోటిఫికేషన్లు జారీచేసి భర్తీ చేయాలని కమిషన్‌ నిర్ణయించింది.

ఈ మేరకు గ్రూప్‌-2, 3 ఉద్యోగాలకు ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయిందని టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా 1000 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్స్ (ఎఫ్‌బీవో) పోస్టులు, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు సంబంధించిన ప్రకటనలు కూడా ఈ నెలాఖరులోగా వెలువరించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో