RRC Railway Recruitment 2022: నిరుద్యోగులకు బంపరాఫర్! పదో తరగతి అర్హతతో సెంట్రల్ రైల్వేలో 2,422 ఉద్యోగాలు..
భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ రైల్వేలో.. 2,422 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల..
భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ రైల్వేలో.. 2,422 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ముంబాయి, భుసావల్, పూణె, నాగ్‌పూర్, సోలాపూర్ క్లస్టర్‌లలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వెల్డర్, మెకానిక్ డీజిల్, టర్నర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత ట్రేడులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. డిసెంబర్ 15, 2022 నాటికి దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 15, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి మొదటి ఏడాది నెలకు రూ.7000లు స్టైపెండ్ చెల్లిస్తారు. రెండో ఏడాది 10 శాతం, మూడో ఏడాది 15 శాతం అధికంగా స్టైపెండ్ ఇస్తారు. వసతి సదుపాయం కల్పించరు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.