Afghanistan: మహిళలపై మరోసారి నిషేధం విధించిన తాలిబన్లు.. రెస్టారెంట్లుకు కూడా రానియకుండా ఆంక్షలు
అఫ్ఝానిస్తాన్ లో తాలిబన్లు మరోసారి మహిళలపై ఆంక్షలు విధించనున్నారు. హెరాత్ ప్రావిన్సులోని మహిళలు, కుటుంబాలు.. ఆరుబయట, పచ్చికబయళ్లున్న రెస్టారెంట్లోకి రావడాన్ని నిషేధించింది.

అఫ్ఝానిస్తాన్ లో తాలిబన్లు మరోసారి మహిళలపై ఆంక్షలు విధించనున్నారు. హెరాత్ ప్రావిన్సులోని మహిళలు, కుటుంబాలు.. ఆరుబయట, పచ్చికబయళ్లున్న రెస్టారెంట్లోకి రావడాన్ని నిషేధించింది. అయితే ఇటవంటి చోట్లకు వచ్చినప్పుడు పురుషులు, మహిళలు కలిసిపోతున్నారని.. ముఖ్యంగా మహిళలు హిజాబ్ ధరించడం లేదని అక్కడి మత పెద్దలు ఫిర్యాదు చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఫ్ఘానిస్తాన్ అధికారులు తెలిపారు. అయితే ఈ నిషేధం కేవలం హెరాత్ ప్రావిన్సులోని మహిళలు, పురుషులు కలుసుకునే పచ్చిక బయళ్లతో ఉన్న రెస్టారెంట్లుకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
అయితే ఇటీవల అఫ్ఘాన్ అధికారులు అన్ని రెస్టారెంట్లోకి మహిళలు, కుటుంబాలు రావడాన్ని నిషేధించాయని వార్త కథనాలు వచ్చాయి. అయితే వీటిని ఆ అధికారులు ఖండించారు. కేవలం హెరాత్ ప్రావిన్సులో మాత్రమేనని తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా 2021 అఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మహిళల పరిస్థితి మరింత దిగజారింది. 6వ తరగతి దాటిన అమ్మాయిలను తరగతి గదిలోకి రానియకపోవడం, యూనివర్శిటీలో మహిళలకు నిషేధం విధించడం, ఐక్యరాజ్య సమితిలో చేసే ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాలు చేయనీయకుండా చేశారు. అలాగే పార్కులు, జిమ్ములు లాంటి వాటిలో కూడా మహిళను నిషేధించారు. అలాగే రాజకీయ పదవులు ఇవ్వకపోవడం. మగవారి తోడు లేకుండా పని చేయడం అలాగే ప్రయాణాలు చేయడం లాంటి వాటిపై కూడా నిషేధం విధించారు.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.