Rare Tortoise: జూలో పుట్టిన అరుదైన తాబేలు.. ప్రపంచంలోనే మొదటిసారి..!

Rare Tortoise: జూలో ఓ అరుదైన తాబేళ్లు జన్మించింది. స్విట్జర్లాండ్‌లోని సర్వియన్‌లోని ట్రోపిక్వేరియం జంతు ప్రదర్శనశాల ఈ విషయాన్ని తెలియజేసింది. వాటి సైజు కూడా..

Rare Tortoise: జూలో పుట్టిన అరుదైన తాబేలు.. ప్రపంచంలోనే మొదటిసారి..!
Follow us

|

Updated on: Jun 13, 2022 | 1:41 PM

Rare Tortoise: జూలో ఓ అరుదైన తాబేళ్లు జన్మించింది. స్విట్జర్లాండ్‌లోని సర్వియన్‌లోని ట్రోపిక్వేరియం జంతు ప్రదర్శనశాల ఈ విషయాన్ని తెలియజేసింది. వాటి సైజు కూడా పెద్దదిగానే ఉంటుందని తెలిపింది. ఇటీవలే రెండు బేబీ జెయింట్ గాలాపాగోస్ తాబేళ్లను స్వాగతించినట్లు జూ నిర్వాహకులు వెల్లడించారు. ఒక తాబేలు దాని తల్లిదండ్రుల మాదిరిగానే ముదురు రంగుతో ఉంటే మరొక తాబేలుకు అల్బినిజం ఉంది. జాతుల్లోనే ఇది అరుదైనది కాగా, ఈ పిల్ల తాబేళ్ల లింగాన్ని ఇంకా నిర్ణయించలేదు. మా బేబీ గాలాపాగోస్ జెయింట్ తాబేళ్లలో అల్బినో శిశువు కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. ఇది జంతుప్రదర్శనశాలలలో లేదా అడవిలో ఎప్పుడూ చూడ లేదని జూ సోషల్ మీడియాలో అరుదైన తాబేలు ఫోటోలను పంచుకుంది.

ప్రపంచంలో ఇదే మొదటిసారి

అంతరించిపోతున్న ఈ అల్బినో లాంటి జాతి తాబేళ్ల జాతి పుట్టడమే అరుదైనదని పేర్కొంది. అల్బినో గాలాపాగోస్ తాబేలు పుట్టి బందిఖానాలో ఉంచటం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని జూ అధికారులు తెలిపారు. మానవులలో 20వేల మందిలో ఒకరు ఎలా అరుదుగా ఉంటారో.. అలాగే 100,000 తాబేళ్లలో అల్బినిజం చాలా అరుదు అని అన్నారు. కాగా, ఫిబ్రవరి 11న తల్లి తాబేలు ఐదు గుడ్లు పెట్టడంతో మే 1న అల్బినో పిల్ల తాబేలు పొదిగింది. మరో తాబేలు మే 5న పొదింది. ఇలా జూలో అరుదైన తాబేళ్లు పుట్టడం ఆశ్చర్యంగా ఉందని జూ అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

Switzerland Zoo Tortoise

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి