Viral Video: స్పైడర్ మ్యాన్‌గా మారిన రోబో.. ఊహించని రీతిలో స్టంట్లు.. చివరికి..
రోబో స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేసిన ఘటన అమెరికాలోని డిస్నీ కాలిఫోర్నియా అడ్వెంచర్ పార్క్‌లో చోటుచేసుకుంది.
Spider-Man Stunt – Viral Video: స్పైడర్ మ్యాన్ సినిమాలంటే.. చిన్నా పెద్దా అందరూ ఇష్టంతో చూస్తుంటారు. ఆ సినిమాల్లో చేసే స్టంట్లు అందరినీ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా.. అచ్చం స్పైడర్ మ్యాన్ లాగానే స్టంటు చేసిన ఓ రోబో.. చివరకు ఊహించని విధంగా ప్రమాదంలో పడిపోయింది. అవును మీరు విన్నది నిజమే.. రోబోట్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో.. చాలా సంస్థలు రోబోలను పలు పనుల కోసం వినియోగిస్తున్నాయి. అలానే ఓ రోబోను అచ్చం స్పైడర్ మ్యాన్‌లా తయారు చేసి.. దానితో స్టంట్లు చేయిస్తున్నారు నిర్వహాకులు.. తాజాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ తెగ వైరల్ అవుతోంది. రోబో స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేసిన ఘటన అమెరికాలోని డిస్నీ కాలిఫోర్నియా అడ్వెంచర్ పార్క్‌లో చోటుచేసుకుంది. తాడు సహాయంతో స్పైడర్ మ్యాన్ రోబో చేసిన స్టంట్.. అందరినీ ఆకట్టుకుంది. అయితే.. ల్యాండింగ్ అవుతున్న క్రమంలో అదుపుతప్పి స్పైడర్ మ్యాన్ రోబో కిందపడిపోయింది. దీంతో బిల్డింగ్ రూఫ్ కూడా ధ్వంసమైంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో స్పైడర్ మ్యాన్ రోబోట్ తాడు సహాయంతో స్వింగ్ చేస్తూ.. ఫ్లిప్‌లు కొడుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఈ క్రమంలో కొన్ని సెకన్లలో ల్యాండింగ్ కావాల్సి ఉంది. అయితే.. అనుకున్నట్లుగా జరగలేదు. దీంతో స్పైడర్ మ్యాన్ రోబో కిందపడిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని మాత్రం వీడియోలో చూపించలేదు.
వీడియో..
View this post on Instagram
ఈ వీడియోను mdglee_szm అనే యూజర్ షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించడంతో పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో పలు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఘటన డిస్నీ కాలిఫోర్నియా అడ్వెంచర్ పార్క్‌లోని ఎవెంజర్స్ క్యాంపస్‌ను జూన్ 4, 2021న తెరిచారని.. అప్పుడే ఈ ఘటన జరిగినట్లు పేర్కొంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..