Ravi Kiran |
Updated on: Jun 13, 2022 | 4:09 PM
ఆక్సిజన్ ఇచ్చి ప్రాణాలు పోసే చెట్ల గురించి మీరు వినే ఉంటారు. కానీ ప్రాణాలు తీసే చెట్టు గురించి ఎప్పుడైనా విన్నారా.? అవునండీ మీరు వినేది నిజమే.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టు ఒకటి ఉంది.
కరేబీయన్ సముద్ర తీరాల్లో కనిపించే ఈ మన్షినిల్ చెట్టు.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టు. ఇవి ప్రస్తుతం ఉత్తర-దక్షిణ అమెరికా, ఫ్లోరిడా, ది బహమాస్, మెక్సికోలలో కనిపిస్తుంటాయి.
50 అడుగుల వరకు పెరగగలిగే ఈ చెట్లలో ప్రతీ భాగం విషపూరితం. తాకితే చాలు ప్రాణాలకు ముప్పు వాటిల్లినట్లే. ఇక దీని పండ్లు చూడటానికి గ్రీన్ యాపిల్‌లా ఉంటాయి.. కానీ అవి తింటే మనుషులు చనిపోతారు.
ఈ చెట్ల పండ్లను తింటే.. నోట్లో మంట మొదలై.. గొంతు పట్టేస్తుంది. ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది.
క్రిస్టోఫర్ కొలంబస్ అనే శాస్త్రవేత్త మంచినిల్ పండుకు ”ఆపిల్ అఫ్ ది డెత్” అని పేరు పెట్టారు. ఈ చెట్టు ఎంతటి విషపూరితమంటే.. పండు రసం కళ్లకు తగిలితే చాలు.. ఆ వ్యక్తి అంధుడు అయినట్లే. వర్షంలో కూడా ఈ చెట్టు కింద నిలబడటం మానవులకు హాని కలుగుతుంది.
కరేబియన్ వడ్రంగులు శతాబ్ద కాలం నుంచి ఈ చెట్టును ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తున్నారు. దానిని ఉపయోగించే ముందు.. విషాన్ని తొలగించేందుకు ఆ చెట్టు కలపను చాలా రోజులు ఎండలో ఎండబెట్టేవారట.