Sundar Pichai: దేశ ప్రజలకు ఏఐ ఉపయోగపడాలని మోదీ కోరుకుంటున్నారు: సుందర్‌ పిచాయ్‌

ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం సుందర్‌ పిచాయ్‌ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మేకింగ్‌ ఇన్‌ ఇండియా, డిజైనింగ్‌ ఇన్‌ ఇండియాను సమర్థవంతంగా అమలు చేసేందుకు మోదీ ముందుకు వచ్చారన్నారు. భారత ప్రజలకు ప్రయోజనం...

Sundar Pichai: దేశ ప్రజలకు ఏఐ ఉపయోగపడాలని మోదీ కోరుకుంటున్నారు: సుందర్‌ పిచాయ్‌
Modi, Sundar Pichai
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 23, 2024 | 12:02 PM

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ప్రముఖ టెక్‌ కంపెనీలకు చెందిన సీఈఓలతో సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌తో పాటు, జెన్స్‌ హువాంగ్‌ సహా ప్రధాన టెక్‌ కంపెనీల సీఈఓలతో ముచ్చటించారు. మేధో సంపత్తి పరిరక్షణకు భారతదేశం లోతైన నిబద్ధత గురించి అమెరికా వ్యాపారవేత్తలకు తెలిపారు. ప్రపంచానికి భారత దేశం అందించే అవకాశాలపై ప్రధాని మోదీ ఈ సందర్భంగా చర్చించారు.

ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం సుందర్‌ పిచాయ్‌ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మేకింగ్‌ ఇన్‌ ఇండియా, డిజైనింగ్‌ ఇన్‌ ఇండియాను సమర్థవంతంగా అమలు చేసేందుకు మోదీ ముందుకు వచ్చారన్నారు. భారత ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించాలని మోదీ పిలుపునిచ్చారన్నారు.

భారతదేశ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఏఐలో అభివృద్ధి చేయాలని సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ప్రధానమంత్రి తన డిజిటల్ ఇండియా విజన్‌తో భారతదేశాన్ని మార్చడంపై దృష్టి పెట్టారన్నారు. గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్స్‌ భారతదేశంలో తయారవుతున్నందుకు మేము గర్విస్తున్నాము అని సుందర్‌ పిచాయ్‌ చెప్పుకొచ్చారు. న్యూయార్క్‌లో ప్రధాని మోదీ నిర్వహించిన రౌండ్‌టేబుల్‌లో అడోబ్ ఛైర్మన్ ప్రెసిడెంట్ అండ్‌ సీఈఓ శంతను నారాయణ్, IBM COE అరవింద్ కృష్ణ, AMD యొక్క లిసా సు CEO, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..