AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Omicron: కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న ప్రపంచ దేశాలు.. స్పెయిన్‌లో కొత్త రకం ఫ్లూ తరహాలో ఎండెమిక్‌!

యూర‌ప్ దేశాల్లో క‌రోనా కేసులు ఇదివ‌ర‌కు ఉన్న రికార్డుల‌ను బ్రేక్ చేస్తూ రోజువారీ కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో అక్కడి ఆస్పత్రులు రోగుల‌తో నిండిపోతున్నాయి.

Covid Omicron: కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న ప్రపంచ దేశాలు.. స్పెయిన్‌లో కొత్త రకం ఫ్లూ తరహాలో ఎండెమిక్‌!
Coronavirus
Balaraju Goud
|

Updated on: Jan 14, 2022 | 10:01 AM

Share

Spain end-demic approach to Omicron: కరోనా థర్డ్‌ వేవ్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో న‌వంబ‌ర్‌లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా యూర‌ప్ దేశాల్లో క‌రోనా కేసులు ఇదివ‌ర‌కు ఉన్న రికార్డుల‌ను బ్రేక్ చేస్తూ రోజువారీ కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో అక్కడి ఆస్పత్రులు రోగుల‌తో నిండిపోతున్నాయి. మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు.. ప్రపంచ దేశాలు ఒక్కొక్కటి ఒక్కో తరహా విధానం అనుసరిస్తున్నాయి.

కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న యూరప్‌లో ఈ నెల తొలి వారంలో 70 లక్షల ఒమిక్రాన్ కేసులు అక్కడ నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. యూరప్‌‌లో 26 దేశాల్లో ఒక శాతం జనాభా ప్రతి వారం కరోనా బారిన పడుతోంది. ఆయా దేశాల్లో హెల్త్ సిస్టమ్స్‌‌పై ఒత్తిడి పెరుగుతోంది. వచ్చే 6 నుంచి 8 వారాల్లో వెస్టర్న్ యూరప్‌‌లోని సగం జనాభా కరోనా బారిన పడే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు అంచనా వేశారు. మరో వైపు కరోనా మహమ్మారిని సాధారణ ఫ్లూ స్థాయికి తగ్గించే టర్నింగ్‌ పాయింట్‌ ఒమిక్రానే అనే అభిప్రాయాన్ని శాస్త్రజ్ఞులు వ్యక్తం చేస్తున్నారు.

మాటిమాటికీ పాజిటివ్ కేసులు వేవ్‌లాగా పెరగడం.. ఆ తర్వాత తగ్గడం.. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్ల రాక.. ముగింపులేని ప్రక్రియలాగా సాగుతున్న తీరుతో యూర్‌పలో పలు దేశాలు విసిగిపోయాయి. దీనిని సాధారణ ఫ్లూలాగా పరిగణించి, తమ వ్యూహాలను అందుకు తగ్గట్టుగా రూపొందించుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. స్పెయిన్‌ ఇప్పటికే కరోనాను పాండెమిక్‌ లాగా కాకుండా.. ఫ్లూ తరహాలో ఎండెమిక్‌లాగా పరిగణిస్తోంది. ముఖ్యంగా ఒమైక్రాన్‌ వేరియంట్‌ వల్ల కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నా… ఆస్పత్రిపాలయ్యేవారి సంఖ్య, మరణాల సంఖ్య తక్కువగా ఉండడంతో దీన్ని ఎండెమిక్‌గా పరిగణించాలని స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో చాలా యూరప్‌ దేశాలు క్వారంటైన్‌ కాలవ్యవధిని తగ్గించేస్తున్నాయి. రష్యాలోనూ ఒమిక్రాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. ఏడాది మార్చిలోపు ప్రపంచవ్యాప్తంగా 60% జనాభా ఒమిక్రాన్‌ బారినపడే అవకాశాలున్నాయి. జనవరిలోపు రోజు వారీ కేసులు 50 లక్షలకు చేరవచ్చన్న అంచనాలున్నాయి.

Read Also…  North Korea: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కి అమెరికాపై కోపం వచ్చిందట.. ఏం చేయబోతున్నాడో తెలుసా?