AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

North Korea: అమెరికా రెచ్చగొడితే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం.. మరోసారి రెచ్చిపోయిన నార్త్‌ కొరియా అధ్యక్షుడు.

North Korea: నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి రెచ్చిపోయారు. నిత్యం ఏదో ఒక వివాదాంశంతో వార్తల్లో నిలిచే కిమ్‌ తాజాగా మరోసారి అమెరికాను హెచ్చరించారు. అమెరికా, దక్షిణ కొరియా తమ దేశాన్ని రెచ్చగొడితే...

North Korea: అమెరికా రెచ్చగొడితే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం.. మరోసారి రెచ్చిపోయిన నార్త్‌ కొరియా అధ్యక్షుడు.
Narender Vaitla
|

Updated on: Jul 29, 2022 | 7:15 AM

Share

North Korea: నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి రెచ్చిపోయారు. నిత్యం ఏదో ఒక వివాదాంశంతో వార్తల్లో నిలిచే కిమ్‌ తాజాగా మరోసారి అమెరికాను హెచ్చరించారు. అమెరికా, దక్షిణ కొరియా తమ దేశాన్ని రెచ్చగొడితే అణ్వాయుధాలు ప్రయోగిస్తామని గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం నార్త్‌ కొరియాలో.. కొరియా యుద్ధం 69వ వార్షికోత్సవాలు ప్యాంగ్యాంగ్‌లో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. 1950-53 నాటి ఈ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రసగించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికా, దక్షిణ కొరియాలకు కిమ్‌ వార్నింగ్ ఇచ్చారు. ఈ రెండు దేశాలు సంయుక్తంగా చేపట్టిన యుద్ధ విన్యాసాలను తప్పు బట్టిన కిమ్‌.. ఆ విన్యాసాలను తమ దేశంపై దండయాత్రకు రిహాల్సల్స్‌గా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కొరియా ద్వీపకల్పాన్ని అమెరికా, దక్షిణ కొరియా యుద్ధంలోకి నెడుతున్నాయని ఆరోపించారు. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తూ ఉత్తర కొరియాను బూచిగా చూపుతోందని ధ్వజమెత్తారు.

ఈ విషయమై కిమ్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యున్ సుక్ యోల్‌ యుద్ధ ఉన్మాదిగా ప్రవర్తిస్తున్నారు. యున్‌ అధికారం చేపట్టి నుంచి అమెరికాతో సైనిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. మాపై అమెరికా, దక్షిణ కొరియా యుద్ధానికి వస్తే ఉత్తర కొరియాను నాశనం చేస్తాము’ అని వార్నింగ్ ఇచ్చారు. మరి కిమ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే