Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sperm Donor: సీరియల్‌ స్పెర్మ్ డోనర్ నిర్భంధం.. ఆ దేశానికి వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న అధికారులు..

కరోనా సమయంలో ఎక్కువ మందికి వీర్యాన్ని దానం చేసి వార్తల్లో నిలిచాడు. అలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 మందికి కైల్ గోర్డి వీర్యదానం చేశాడు.

Sperm Donor: సీరియల్‌ స్పెర్మ్ డోనర్ నిర్భంధం.. ఆ దేశానికి వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న అధికారులు..
Kyle Gordy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 29, 2022 | 6:15 AM

Serial sperm donor Kyle Gordy: స్పెర్మ్ డోనర్ కైల్ గోర్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కు చెందిన 30 ఏళ్ల కైల్ గోర్డి వీర్యదాతగా మారి సంతాన సమస్యలతో బాధపడేవారికి తన వీర్యాన్ని దానం చేస్తుంటాడు. కరోనా సమయంలో ఎక్కువ మందికి వీర్యాన్ని దానం చేసి వార్తల్లో నిలిచాడు. అలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 మందికి కైల్ గోర్డి వీర్యదానం చేశాడు. గోర్డి తన సేవలను Facebookలో కూడా ప్రచారం చేస్తాడు. కృత్రిమ లేదా సహజమైన గర్భధారణ పద్ధతులను ఉపయోగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌ అయ్యాడు. అయితే.. తాజాగా సీరియల్ స్పెర్మ్ దాత కైల్‌ గోర్డి చిక్కుల్లో పడ్డాడు. న్యూజిలాండ్‌కు వెళ్లే మార్గంలో ఫిజీలో అధికారులు నిర్బంధించారు. అయితే అతను వీర్య దాన పర్యటనలో ఉండగా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 47 మంది పిల్లల పుట్టుకకు కారణమైన US వ్యక్తి కైల్ గోర్డి ఈ ఉదయం లాస్ ఏంజిల్స్ నుంచి విమానంలో వెళ్తుండగా నడి అంతర్జాతీయ విమానాశ్రయంలో (Nadi International Airport) తనను ఆపివేసినట్లు వార్తా సంస్థ హెరాల్డ్‌తో చెప్పాడు.

తాను దిగి.. లైన్‌లో 30 లేదా 40 నిమిషాలపాటు ఉన్నానని.. ఓ వ్యక్తి తన కంప్యూటర్‌ను చూస్తూ.. ఏదో పనిమీద మాట్లాడాలి అంటూ పక్కకు తీసుకెళ్లాడని చెప్పాడు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు అడిగారని.. న్యూజిలాండ్ ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించారని పేర్కొన్నారు. అనంతరం ఫిజీ అధికారులు ఇమ్మిగ్రేషన్ న్యూజిలాండ్‌కు ఫోన్ చేసి వివరాలు కనుగొన్నట్లు గోర్డి చెప్పాడు. హాబిటన్‌, క్వీన్స్‌టౌన్ వంస్పాట్‌లను ఉటంకిస్తూ టూరిజం కోసం దేశానికి వెళుతున్నానని తెలిపాడు. ఆడమ్ హూపర్ అనే స్నేహితుడిని కలిసేందుకు వెళుతున్నానని చెప్పాడు.. హూపర్‌ కూడా వివిధ దేశాలలో 20 కంటే ఎక్కువ మంది పిల్లలతో ఆస్ట్రేలియన్ సీరియల్ స్పెర్మ్ డోనర్‌గా ఉన్నాడు. హూపర్ నిన్న దేశానికి వచ్చి ఇద్దరు మహిళలకు విరాళం ఇచ్చినట్లు హెరాల్డ్‌తో చెప్పాడు.

గోర్డి ఈ సందర్భంగా ఒక వెల్లింగ్‌టన్ మహిళ పేరును కూడా ప్రస్తావించి.. స్పెర్మ్‌ను దానం చేయడానికి వెళ్తున్నట్లు చెప్పగా అధికారులు నిరాకరించినట్లు వివరించారు. ఇమ్మిగ్రేషన్‌కు సరైన కారణం చెప్పలేదని అధికారులు తెలిపారు. దీనిపై ఇమ్మిగ్రేషన్ అధికారి మాట్లాడుతూ.. కైల్‌ మరొక కారణంతో వస్తున్నారని చూపించే ఇమెయిల్‌లు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే నిర్భందించినట్లు వివరించారు. విచారణ అనంతరం అతన్ని యూఎస్‌ పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..