Smartwatches Detect COVID-19: లక్షణాలు, టెస్టుల కంటే ముందుగానే కరోనా వైరస్ మనశరీరంలో ఉన్నదీ..లేనిది గుర్తించే వాచ్.. !

మనకు కరోనా ఉంది లేదని తెలియడానికి కరోనా టెస్టుల కంటే ముందుగానే ఆపిల్ స్మార్ట్ వాచ్ డిటెక్ట్ చేయగలదు అంటున్నారు పరిశోధకులు . అంతేకాదు మనకు కరోనా వ్యాధి ఉందో.. లేదో లక్షణాలు..

Smartwatches Detect COVID-19: లక్షణాలు, టెస్టుల కంటే ముందుగానే కరోనా వైరస్ మనశరీరంలో ఉన్నదీ..లేనిది గుర్తించే వాచ్.. !
Follow us

|

Updated on: Jan 17, 2021 | 4:31 PM

Smartwatches Detect COVID-19: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో నిర్ధారణ కోసం తీసుకునే సమయం మూడు నుంచి నాలుగు రోజులుండేది. కాలక్రమంలో శాస్త్రజ్ఞులు ఈ వైరస్ ను గుర్తించడానికి అనేక ప్రయోగాలు చేసి.. కేవలం గంటల్లోనే రిజల్ట్ వచ్చేలా పరికరాలు తయారు చేశారు. అయితే తాజాగా మనకు కరోనా ఉంది లేదని తెలియడానికి కరోనా టెస్టుల కంటే ముందుగానే ఆపిల్ స్మార్ట్ వాచ్ డిటెక్ట్ చేయగలదు అంటున్నారు పరిశోధకులు . అంతేకాదు మనకు కరోనా వ్యాధి ఉందో లేదో లక్షణాలు బయటపడితేనే తెలుస్తుంది. అయితే అంతకంటే ముందుగానే.. అంటే కరోనా వైరస్ మన శరీరంలోకి ప్రవేసించి లక్షణాలు బయటపడకుండానే కరోనా వైరస్ ఉన్నదీ.. లేనీదీ స్మార్ట్ వాచ్ ఎలా నిర్ధారిస్తుందో అధ్యయన ఫలితాల్లో వివరించారు. ఆపిల్ స్మార్ట్ వాచ్ పనితీరుకు సంబంధించి న్యూయార్క్‌లోని మౌంట్ సినాయి హెల్త్ సిస్టమ్, కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో టెక్ నిపుణులు. రెండు అధ్యయనాలను నిర్వహించారు.

ఆపిల్ స్మార్ట్ వాచ్.. కరోనా మహమ్మారితో పాటు సీజనల్ వ్యాధులను సులభంగా గుర్తించగలదని …అంటున్నారు. ఆపిల్ స్మార్టో వాచ్ ధరించిన వ్యాధి హార్ట్ బీట్ లో మార్పుల ఆధారంగా అతనికి కరోనా సోకిందనే విషయం గుర్తించగలదని అంటున్నారు. కరోనా లక్షణాలు, పాజిటివ్ తేలడానికి వారం రోజుల ముందే ఈ ఆపిల్ వాచ్ కనిపెట్టగలదని పరిశోధకులు చెప్పారు. తమ పరిశోధన కోసం ఆగష్టు 29 నుంచి సెప్టెంబర్ 29 మధ్య నెలలో ఆపిల్ వాచ్ ధరించిన 300 మంది హెల్త్ కేర్ వర్కర్ల హార్ట్ బీట్ రేట్ లో మార్పులు, సమయాన్ని విశ్లేషించారు. సాధారణంగా ఈ హార్ట్ బీట్ రేటు ఆధారంగానే ఒక వ్యక్తిలో రోగనిరోధక శక్తి ఎలా పనిచేస్తుందనే సులభంగా తెలుసుకోవచ్చు. ఆపిల్ స్మార్ట్ వాచ్ లోనూ ఇదే విధానంలో సులభంగా గుర్తించవచ్చునని అంటున్నారు. అత్యాధునిక సాంకేతిక టూల్స్ ద్వారా ఇన్ఫెక్షన్ సోకినప్పుడే వెంటనే గుర్తించేలా ఆపిల్ వాచ్ వంటి స్మార్ట్ డిటెక్టర్లను డెవలప్ చేయడమే తమ లక్ష్యమని చెబుతున్నారు.

మనిషికి ఏదైనా వైరస్ సోకినప్పుడు బహిరంగంగా లక్షణాలు కనిపించడానికంటే ముందే చాలా మందిలో వ్యాధి ప్రవేసిందో లేదో ఈజీగా గుర్తించవచ్చు అని పరిశోధకులు చెప్పారు. అలా గుర్తించిన వెంటనే వాచ్ మనకు తెలిపే విధంగా ఓ అలారం సిస్టమ్ ను కూడా క్రియేట్ చేశామని అన్నారు. హార్ట్ బీట్ లో మార్పులు వచ్చిన వెంటనే అలారం అలర్ట్ అయ్యి మనల్ని అలర్ట్ చేస్తుందని సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read Also: మన ఆర్మీ కోసం సైంటిస్ట్ కృషి.. ఫైర్ షూస్ ఆవిష్కరణ..శత్రువుల గుండెల్లో బుల్లెట్ల మోతే..