World Covid 19 Update: మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, 9.5 కోట్లకు పైగా బాధితులు

ఓ వైపు కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్ ప్రయోగాలు.. మరోవైపు ప్రపంచ దేశాల్లో మళ్ళీ పెరుగుతున్న ఈ వైరస్ జోరు.. ఏడాది నుంచి సృష్టిస్తున్న కరోనా కల్లోల ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ వైరస్ అత్యంత ప్రభావిత దేశంగా అగ్రరాజ్యం అమెరికా నిలుస్తోంది..

World Covid 19 Update: మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, 9.5 కోట్లకు పైగా బాధితులు
Follow us

|

Updated on: Jan 17, 2021 | 3:02 PM

World Covid 19 Update: ఓ వైపు కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్ ప్రయోగాలు.. మరోవైపు ప్రపంచ దేశాల్లో మళ్ళీ పెరుగుతున్న ఈ వైరస్ జోరు.. ఏడాది నుంచి సృష్టిస్తున్న కరోనా కల్లోల ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ వైరస్ అత్యంత ప్రభావిత దేశంగా అగ్రరాజ్యం అమెరికా నిలుస్తోంది. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 6,28,938 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 9,50,07,057కోట్లు దాటింది.. ఇలాగే కొనసాగితే 10 కోట్లకు చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదని నివేదికలు ద్వారా తెలుస్తుంది అని అంటున్నారు. గత 24గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 12,789 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 20,32,106కి చేరింది. రికవరీ కేసుల సంఖ్య 6.78కోట్లకు పైగా ఉండగా…. యాక్టివ్ కేసులు 2.51 కోట్లకు పైగా ఉన్నాయి. వాటిలో 1,11,579 మందికి కరోనా తీవ్రంగా ఉంది.

అమెరికాలో శనివారం ఒక్కరోజే 1,95,809 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2,42,99,085కి చేరింది. నిన్న 3,353 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 4,05,237కి చేరింది.

ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత బ్రిటన్ రష్యా, ఫ్రాన్స్ ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా… బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా కరోనా వైరస్ మళ్ళీ విజృంభించడానికి కారణం అని వైద్య సిబ్బంది చెప్పారు.

Also Read: మన ఆర్మీ కోసం సైంటిస్ట్ కృషి.. ఫైర్ షూస్ ఆవిష్కరణ..శత్రువుల గుండెల్లో బుల్లెట్ల మోతే..