China Builds 1500 Room Hospital : మళ్ళీ కరోనా పుట్టిల్లు చైనాలో పెరుగుతున్న కేసులు, 5 రోజుల్లో 1500పడకల ఆస్పత్రి నిర్మాణం
కోవిడ్ 19 పుట్టినిల్లు చైనా లో మళ్ళీ ఈ వైరస్ విజృంభిస్తోంది. రాజధాని బీజింగ్ లో రోజు రోజుకీ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే హెబీ ప్రావిన్సు పరిధిలోని షిజియాజువాంగ్ నగరంలో లాక్ డౌన్ విధించారు. మరోవైపు వివిధ ప్రదేశాల్లో..
China Builds 1500 Room Hospital : కోవిడ్ 19 పుట్టినిల్లు చైనా లో మళ్ళీ ఈ వైరస్ విజృంభిస్తోంది. రాజధాని బీజింగ్ లో రోజు రోజుకీ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే హెబీ ప్రావిన్సు పరిధిలోని షిజియాజువాంగ్ నగరంలో లాక్ డౌన్ విధించారు. మరోవైపు వివిధ ప్రదేశాల్లో కొత్తగా కేసులు వెలుగు చూస్తున్నాయి. 8నెలల తర్వాత కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయని ఆ దేశ వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. చైనాలో ఒక్క శుక్రవారమే 168 కేసులు నమోదు కాగా.. కోవిడ్ కేసుల్లో చైనా 10 నెలల గరిష్టానికి చేరుకుంది.
ఈనేపధ్యంలో చైనా మళ్ళీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టింది. అత్యంత కార్మిక శక్తిగా డ్రాగన్ కంట్రీ కేవలం 5 రోజుల్లోనే ఆస్పత్రిని నిర్మించింది. నాంగోంగ్‌లో మొత్తం 6,500 పడకలు ఉన్న ఆరు ఆస్పత్రుల్లో ఇదొకటిగా జిన్‌హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. వచ్చేవారంలో అన్ని పడకల నిర్మాణం పూర్తివుతుందని అంచనా వేస్తోంది.
ఏడాది క్రితం చైనా వూహన్ లో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. ఆరుకేసులతో మొదలైన కరోనా బాధితుల సంఖ్య శనివారం నాటికి 97,000 లకు చేరుకుంది. ఇప్పటి వరకూ ఈ వైరస్ తో 4,700 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు.
Also Read: ఆ యువకుడు వయస్సు 22 ఏళ్ళు, చేసుకున్న పెళ్లిళ్లు 11.. లవ్లీ గణేష్ గా యువతులకు వల