Golden Canary Diamond: మట్టికుప్పులో దొరికిన వజ్రం.. వేలానికి సిద్ధం.. ధర ఎంతో తెలుసా..?

ప్రపపంచంలో అనేక రకాల వజ్రాలు ఉన్నాయి. అయితే దేని ప్రత్యేకత దానికే ఉంది. అత్యంత అరుదైన ఈ వజ్రాలను కొన్ని సందర్భాల్లో వేలం వేస్తుంటారు. ఈ క్రమంలో అవి ఒకదానిని మించి మరొకటి ధర పలుకుతాయి. ఇటీవల అత్యంత అరుదైన పింక్‌ వజ్రాన్ని హాంకాంగ్‌లో వేలం..

Golden Canary Diamond: మట్టికుప్పులో దొరికిన వజ్రం.. వేలానికి సిద్ధం.. ధర ఎంతో తెలుసా..?
Golden Canary Diamond
Follow us

|

Updated on: Oct 18, 2022 | 10:30 PM

ప్రపపంచంలో అనేక రకాల వజ్రాలు ఉన్నాయి. అయితే దేని ప్రత్యేకత దానికే ఉంది. అత్యంత అరుదైన ఈ వజ్రాలను కొన్ని సందర్భాల్లో వేలం వేస్తుంటారు. ఈ క్రమంలో అవి ఒకదానిని మించి మరొకటి ధర పలుకుతాయి. ఇటీవల అత్యంత అరుదైన పింక్‌ వజ్రాన్ని హాంకాంగ్‌లో వేలం వేశారు. గులాబీరంగులో మెరిసిపోయే ఈ వజ్రం వేలంలో 480 కోట్లు ధర పలికి రికార్డు సృష్టించింది. తాజాగా మరో వజ్రం వేలానికి సిద్ధమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన పెద్దదైన పసుపు రంగు ‘గోల్డెన్‌ కనరీ’ వజ్రాన్ని దుబాయ్‌లోని సోత్‌బేస్‌ ప్రదర్శనలో ఉంచారు. అత్యంత అరుదైన ఈ వజ్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో న్యూయార్క్‌లో వేలం వేయనున్నారు. 1980లలో కాంగో దేశంలో వజ్రాల గని సమీపంలో లభించింది. అప్పుడు దీని బరువు 890 క్యారెట్లు. అయితే అనేకసార్ల ఈ వజ్రాన్ని సానబట్టటంతో చివరకు 303.10 క్యారెట్లకు తగ్గింది. ఈ వజ్రాన్ని డిసెంబర్‌ 7న న్యూయార్క్‌లో వేలానికి ఉంచనున్నారు. ఇది 123 కోట్ల ధర పలకొచ్చని అంచనా వేస్తున్నారు.

గోల్డెన్‌ కనరీ వజ్రం చరిత్ర..

వజ్రాల మైనింగ్ కంపెనీ.. వజ్రాల కోసం మట్టిని తవ్వుతోంది.. ఆ మట్టిని గాలించి, ప్రతి రాయిని పరిశీలించి.. ఏదైనా దొరికితే తీసుకుంటోంది. తర్వాత ఆ మట్టిని, రాళ్లను తీసుకెళ్లి దూరంగా పారబోస్తోంది. ఓ ఇంటి వెనుక పెరట్లో కాస్త గుంతలా ఉండటంతో మట్టికావాలని దాని యజమాని అడిగాడు. దీనితో మట్టి తరలించే కాంట్రాక్టర్.. వజ్రాల గనిలో తవ్వి, పరిశీలించిన మట్టి, రాళ్ల కుప్పను తీసుకువచ్చి ఆ ఇంటి వెనుక పెరట్లో పారబోశాడు. తర్వాత ఆ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారికి.. ఆ మట్టి, రాళ్ల కుప్పలో మెరుస్తున్న ఓ రాయి దొరికింది. అదే ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైన, పెద్ద పసుపు రంగు వజ్రం ‘గోల్డెన్ కనరీ’.

1980వ సంవత్సరంలో కాంగో దేశంలోని ఎంఐబీఏ అనే వజ్రాల మైనింగ్ సంస్థ తవ్విన గనికి సంబంధించిన మట్టిలో ఈ గోల్డెన్ కనరీ వజ్రం దొరికింది. ఆ చిన్నారి ఈ రాయిని తీసుకెళ్లి ఇంటి యజమానికి ఇచ్చింది. అది వజ్రమని గుర్తించిన ఆయన.. స్థానిక వజ్రాల వ్యాపారికి అమ్మి డబ్బులు తీసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..