AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia – Ukraine Crisis: రష్యా – ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. వ్లాదిమిర్ పుతిన్‌కు షాక్ ఇచ్చిన ఫ్రాన్స్..!

Russia - Ukraine Crisis: ఉక్రెయిన్‌పై(Ukraine) రష్యా(Russia) దాడిని చేయడాన్ని ప్రపంచంలోని చాలా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Russia - Ukraine Crisis: రష్యా - ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. వ్లాదిమిర్ పుతిన్‌కు షాక్ ఇచ్చిన ఫ్రాన్స్..!
Putin
Shiva Prajapati
|

Updated on: Mar 03, 2022 | 5:37 PM

Share

Russia – Ukraine Crisis: ఉక్రెయిన్‌పై(Ukraine) రష్యా(Russia) దాడిని చేయడాన్ని ప్రపంచంలోని చాలా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చాలా వరకు దేశాలు(World Nations) రష్యాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పలు దేశాలు రష్యా తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ.. ఆదేశంపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు రష్యాపై ఆర్థిక పరమైన ఆంక్షలు సహా.. అనేక విధాలుగా ఆంక్షలు విధించాయి. వరల్డ్ తైక్వాండో పుతిన్‌కు ప్రదానం చేసిన బ్లాక్‌ బెల్ట్‌ను కూడా వెనక్కి తీసుకుంది. తైక్వాండో బాటలోనే మరికొన్ని సంస్థలు కూడా రష్యాను వెలివేస్తున్నాయి.

తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడికి నిరసనగా పారిస్‌లోని గ్రెవిన్ మ్యూజియం.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మైనపు విగ్రహాన్ని మంగళవారం తొలగించింది. హిట్లర్ లాంటి వాళ్లకు చోటు లేదని మ్యూజియం చెబుతోంది. మ్యూజియం నుంచి తొలగించిన పుతిన్ స్టాచ్యూని ఒక సెల్ఫ్‌లో పెట్టారు. ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి ఘటన ప్యారిస్ మ్యూజియం చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరుగలేదని, ఇదే తొలిసారి అని చెబుతున్నారు నిర్వాహకులు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ఉన్న పుతిన్ మైనపు విగ్రహాన్ని తొలగించిన మ్యూజియం సిబ్బంది.. ఉక్రెయిన్‌పై దండయాత్ర చేసిన నేతగా మ్యూజియంలో ప్రదర్శిస్తామంటున్నారు.

ఇదిలాఉంటే.. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఏ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా డోంట్ కేర్ అంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తన వైఖరికి కట్టుబడి ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై దాడలు చేస్తోంది. క్రమంగా ఉక్రెయిన్‌పై పట్టు సాధిస్తోంది. క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యన్‌ దళాలు ఉక్రెయిన్‌కు దక్షిణాన ఉన్న ఖెర్సన్‌ నగరాన్ని తమ వశం చేసుకున్నాయి. ఖెర్సన్‌ను రష్యా ఆక్రమించుకున్నట్లు ఉక్రెయిన్‌ ధ్రువీకరించింది. మరోవైపు.. కీవ్​లక్ష్యంగా దూసుకెళ్తున్న రష్యా సైన్యం స్థానిక మెట్రోస్టేషన్​సమీపంలో భారీ పేలుళ్లకు పాల్పడింది. భీకర దాడులతో ఎటువెళ్లాలో తెలియక ఉక్రెయిన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. పెద్ద పెద్ద భవనాలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. రెండు దేశాల సైన్యాల మధ్య భీకరపోరు కొనసాగుతోంది.

Also read:

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న రష్యా దహనకాండ.. రాజధాని నగరంపై దాడి.. బంకర్ల వైపు జనం పరుగులు

Telangana: టక్కులాడి.. కి’లేడీ’.. ఏం చేసిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది..

HBCSE-TIFR Jobs 2022: రాత పరీక్ష లేకుండానే.. హోమీ భాభా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు