AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: రష్యా నాటకాలు.. గుట్టు రట్టైంది.. మరీ ఇంత దిగజారాలా..? న్యూస్‌గార్డ్ పరిశోధనల్లో సంచలనాలు!

బాంబులు , మందుగుండు సామాగ్రి మాత్రమే కాదు.. రష్యా సైన్యం యుద్ధరంగంలోకి వచ్చి సామాన్య పౌరులపై తూటాలు పేల్చుతున్నారు.

Russia Ukraine War: రష్యా నాటకాలు.. గుట్టు రట్టైంది.. మరీ ఇంత దిగజారాలా..? న్యూస్‌గార్డ్ పరిశోధనల్లో సంచలనాలు!
Russia Ukraine War
Balaraju Goud
|

Updated on: Mar 03, 2022 | 5:55 PM

Share

Russia Ukraine War: బాంబులు , మందుగుండు సామాగ్రి మాత్రమే కాదు.. రష్యా సైన్యం యుద్ధరంగంలోకి వచ్చి సామాన్య పౌరులపై తూటాలు పేల్చుతున్నారు. ఉక్రెయిన్‌పై చాలా అబద్ధాలు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ(Volodymyr Zelenskyy) నాజీయిజం, ఫాసిస్ట్, అమాయక ప్రజల ఊచకోతకి కూడా కారణమయ్యాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే అమెరికా(Ametica)కు చెందిన ఓ సంస్థ ఉక్రెయిన్‌పై చేస్తున్న అసత్యాలను బట్టబయలు చేసింది. నకిలీ వార్తలను పర్యవేక్షించే, సమీక్షించే న్యూస్‌గార్డ్(Newsguard) , రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన టాప్ 10 అబద్ధాల జాబితాను విడుదల చేసింది. వీటిలో ఉక్రెయిన్ మారణహోమం నుండి రసాయన కర్మాగారంపై బాంబు దాడి వరకు ఉన్నాయి.

  1. అబద్ధం నం. 1: ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో రష్యన్ మాట్లాడే ప్రజలు ఊచకోతకు గురవుతున్నారు. అయితే యూరప్‌లోని సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ అసోసియేషన్ అలాంటి ఆధారాలు ఏవీ కనుగొనలేదు అనేది నిజం.
  2. అబద్ధం నం. 2: ‘పోలిష్ మాట్లాడే ఉగ్రవాదులు డాన్‌బాస్‌లోని క్లోరిన్ ప్లాంట్‌లో బాంబును పేల్చేందుకు ప్రయత్నించారు. కానీ, చూపించిన సంఘటన వీడియోలో పేర్కొన్న తేదీ కంటే చాలా ముందుగానే ఉంది.
  3. అబద్ధం నం. 3: ‘ఉక్రెయిన్ మిలిటరీ ఫిబ్రవరి 17, 2022న తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌లోని పిల్లల పాఠశాలపై బాంబు దాడి చేసింది. అయితే, రష్యా అనుకూల వేర్పాటువాదులు ఈ బాంబు దాడికి పాల్పడ్డారని పరిశోధనల్లో తేలింది.
  4. అబద్ధం నం. 4: ‘ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభంలో రష్యన్ సైన్యం పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదు. కాగా, ఉక్రెయిన్‌లోని నివాస ప్రాంతాల్లో రష్యా సైన్యం దాడులు జరిగినట్లు దాడికి ముందు రోజు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రికార్డ్ చేసింది.
  5. అబద్ధం నం. 5: ‘నాజిస్ట్ ఆలోచన ఉక్రెయిన్ రాజకీయాలు, సమాజంలో ఆధిపత్యం చెలాయిస్తుంది. జెలెన్‌స్కీ ప్రభుత్వం కూడా వారికి మద్దతు ఇస్తుంది. అయితే, 2019 అధ్యక్ష ఎన్నికలలో, తీవ్రవాద జాతీయ పార్టీ స్వోబోడాకు కేవలం 1.6 శాతం ఓట్లు వచ్చాయన్నది నిజం.
  6. అబద్ధం నం. 6: ‘2014లో రష్యా మద్దతు ఉన్న ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పాశ్చాత్య దేశాలు కుట్ర పన్నాయి. 2014 తొలి విప్లవానికి సంబంధించిన ఈ సిద్ధాంతాన్ని రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవు.
  7. అబద్ధం నం. 7: ‘అమెరికా.. తూర్పు ఐరోపాలో జీవ ఆయుధాల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ బయోలాజికల్ థ్రెట్ రిడక్షన్ ప్రోగ్రామ్‌ను తప్పుగా సూచించడానికి ఈ దావా చేయడం జరిగింది.
  8. అబద్ధం నం. 8: ‘నాటోకు దక్షిణ ఉక్రెయిన్‌లోని ఒడెషాలో సైనిక స్థావరం ఉంది.’
  9. అబద్ధం నం. 9: ‘క్రిమియా చట్టబద్ధంగా రష్యాలో చేరింది.’ క్రిమియా రష్యాలో చేరడంపై 2014 ప్రజాభిప్రాయ సేకరణ అన్యాయమని UN అసెంబ్లీ ప్రకటించింది.
  10. అబద్ధం నం. 10: ‘ఆధునిక ఉక్రెయిన్ పూర్తిగా కమ్యూనిస్ట్ రష్యాచే నిర్మించడం జరిగింది. ‘ రష్యా, ఉక్రెయిన్ భాగస్వామ్య సంస్కృతి 1000 సంవత్సరాల కంటే పాతది.

Read Also…  Russia – Ukraine Crisis: రష్యా – ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. వ్లాదిమిర్ పుతిన్‌కు షాక్ ఇచ్చిన ఫ్రాన్స్..!