ఉక్రెయిన్ గ్యాస్ ప్లాంట్‌పై రష్యా భీకర దాడి.. నిలిచిపోయిన విద్యుత్, గ్యాస్ సరఫరా
ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా విరుచుకుపడింది. ఉక్రెయిన్ ప్రభుత్వ యాజమాన్యంలోని గ్యాస్ కంపెనీ నాఫ్టోగాజ్ గ్రూప్ నిర్వహిస్తున్న సహజ వాయువు ప్లాంట్లను రష్యా లక్ష్యంగా చేసుకుంది. గురువారం (అక్టోబర్ 2) రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా భారీ వైమానిక దాడికి పాల్పడింది. 381 డ్రోన్లు, 35 క్షిపణులను ఉపయోగి గ్యాస్ కంపెనీపై దాడి చేసింది.

ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా విరుచుకుపడింది. ఉక్రెయిన్ ప్రభుత్వ యాజమాన్యంలోని గ్యాస్ కంపెనీ నాఫ్టోగాజ్ గ్రూప్ నిర్వహిస్తున్న సహజ వాయువు ప్లాంట్లను రష్యా లక్ష్యంగా చేసుకుంది. గురువారం (అక్టోబర్ 2) రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా భారీ వైమానిక దాడికి పాల్పడింది. 381 డ్రోన్లు, 35 క్షిపణులను ఉపయోగి గ్యాస్ కంపెనీపై విరుకుపడిందని ఉక్రెయిన్ వైమానిక దళ అధికారులు తెలిపారు. శీతాకాలానికి ముందు ఉక్రెయిన్ విద్యుత్ సరఫరా సౌకర్యాలను నాశనం చేసే ప్రయత్నంగా ఈ దాడులు జరిగాయని అధికారులు పేర్కొన్నారు.
ప్రజల సాధారణ జీవితాలకు అవసరమైన గ్యాస్ వెలికితీత, ప్రాసెసింగ్ సేవలను అందించే పౌర సౌకర్యాలపై ఇది ఉద్దేశపూర్వక ఉగ్రవాద దాడి అని నాఫ్టోగాజ్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్హి కోరెట్స్కీ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే దీనికి సైనిక ఉద్దేశ్యం లేదని ఆయన అన్నారు. ఉక్రేనియన్ల జీవితాలను అంతరాయం కలిగించడం, శీతాకాలంలో వారికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న రష్యా, దురుద్దేశపూరిత దాడులకు పాల్పడిందని ఆరోపించారు. ఈ దాడి ఫలితంగా, అనేక ఉక్రేనియన్ నగరాల్లోని వేలాది ఇళ్లకు విద్యుత్, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి, ఉక్రెయిన్ పెద్ద మొత్తంలో గ్యాస్‌ను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది.
రష్యా ఈశాన్యంలోని ఖార్కివ్, మధ్య ప్రాంతంలోని పోల్టావాలోని నాఫ్టోగాజ్ గ్యాస్ అన్వేషణ, ప్రాసెసింగ్ సౌకర్యాలపై 35 క్షిపణులను, 60 డ్రోన్ బాంబులను ప్రయోగించిందని కోరెట్స్కీ తెలిపారు. ఈ దాడులు కొన్ని సౌకర్యాలకు తీవ్ర నష్టం కలిగించాయని ఆయన అన్నారు. ఉక్రెయిన్ సైనిక-పారిశ్రామిక సముదాయం, దానికి మద్దతు ఇచ్చే గ్యాస్, ఇంధన మౌలిక సదుపాయాలపై తమ దళాలు డ్రోన్లు, గైడెడ్ ఆయుధాలను ఉపయోగించి పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పోల్టావాలో రష్యా వైమానిక దాడుల్లో ఎనిమిదేళ్ల బాలుడు సహా ఇద్దరు మహిళలు గాయపడ్డారని ఉక్రేనియన్ అధికారులు తెలిపారు. ఒక దాడిలో నగరంలోని చారిత్రాత్మక సెయింట్ నికోలస్ చర్చి కిటికీలు సగానికి పైగా పగిలిపోయాయని పేర్కొన్నారు.
ఇదిలావుంటే, ఉక్రెయిన్ డ్రోన్ దాడి కారణంగా మాస్కో నుండి 1,500 కిలోమీటర్ల (930 మైళ్ళు) దూరంలో ఉన్న బెరెజ్నికిలోని రష్యాలోని అతిపెద్ద రసాయన కర్మాగారాలలో ఒకటైన అజోట్ కెమికల్ ప్లాంట్ కార్యకలాపాలకు కొద్దిసేపు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. గురువారం రాత్రి దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు కనీసం 20 ఉక్రేనియన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నల్ల సముద్రం మీదుగా ఎగురుతున్నప్పుడు చాలా విమానాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
