AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించినబోతున్న ఐరన్ లేడీ సనే తకైచి..!

లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) కొత్త అధ్యక్షురాలిగా మాజీ ఆర్థిక భద్రతా మంత్రి సనే తకైచిని ఎన్నికయ్యారు. మాజీ ప్రధాన మంత్రి జునిచిరో కోయిజుమి కుమారుడిని ఓడించి తకైచి ఎన్నికల్లో విజయం సాధించారు. కోయిజుమి ప్రస్తుతం దేశ వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ప్రధాన మంత్రిగా తకైచి నియామకంపై పార్లమెంట్ త్వరలో ఓటు వేయనుంది.

జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించినబోతున్న ఐరన్ లేడీ సనే తకైచి..!
Sanae Takaichi, Japan
Balaraju Goud
|

Updated on: Oct 04, 2025 | 12:48 PM

Share

జపాన్ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. జపాన్ ఉక్కు మహిళగా పేరుగాంచిన సనే తకైచి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. దీంతో తకైచి తదుపరి ప్రధానమంత్రి అవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జపాన్‌లోని అత్యంత ఉదారవాద రాజకీయ నాయకులలో ఒకరిగా మాజీ ప్రధాన మంత్రి జునిచిరో కొయిజుమి కుమారుడు, పర్యావరణ మంత్రి షింజిరో కొయిజుమిని అధికార పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సనే తకైచి ఓడించారు. జపాన్‌లో మెజారిటీ పార్టీ అధినేత ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి, ఆమె తదుపరి ప్రధానమంత్రి కావడం దాదాపు ఖాయం..!

లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) కొత్త అధ్యక్షురాలిగా మాజీ ఆర్థిక భద్రతా మంత్రి సనే తకైచిని ఎన్నికయ్యారు. మాజీ ప్రధాన మంత్రి జునిచిరో కోయిజుమి కుమారుడిని ఓడించి తకైచి ఎన్నికల్లో విజయం సాధించారు. కోయిజుమి ప్రస్తుతం దేశ వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ప్రధాన మంత్రిగా తకైచి నియామకంపై పార్లమెంట్ త్వరలో ఓటు వేయనుంది. జూలైలో జరిగిన ఎగువ సభ ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా స్థానంలో తకైచి బాధ్యతలు చేపడతారు. పార్టీలో ఇషిబాపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఆయన పార్టీ ఓటమి పాలైంది.

షిగేరు ఇషిబా సెప్టెంబర్ 2024లో ప్రధానమంత్రి అయ్యారు. పార్టీలో ఆయన బయటి వ్యక్తి, అంటే ఆయనకు గాడ్ ఫాదర్ లేడు. ద్రవ్యోల్బణం, ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కానీ ఆయన పాలనను గాడిలో పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. LDP-కొమైటో సంకీర్ణం 2024 అక్టోబర్‌లో దిగువ సభ (ప్రతినిధుల సభ) ఎన్నికలలో మెజారిటీని కోల్పోయింది. ఆ తర్వాత జూలై 2025లో ఎగువ సభ (కౌన్సిలర్ల సభ) ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 1955 తర్వాత ఆ పార్టీ మొదటిసారిగా రెండు సభలలో మెజారిటీని కోల్పోయింది.

ఓటమి తర్వాత, పార్టీ అంతర్గత కుమ్ములాటలతో ఇషిబాను రాజీనామా చేయమని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. పార్టీకి సంప్రదాయవాద నాయకుడు అవసరం అయితే, ఇషిబా చాలా ఉదారవాది అనే ఆరోపణలు వచ్చాయి. ఇషిబా సెప్టెంబర్ 7, 2025న రాజీనామా చేస్తూ, నేను పార్టీలో చీలికను కోరుకోవడం లేదు. ఇప్పుడు నేను కొత్త తరానికి అవకాశం ఇస్తాను అని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికలు జరిగాయి. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) కొత్త అధ్యక్షురాలిగా మాజీ ఆర్థిక భద్రతా మంత్రి సనే తకైచిని ఎన్నికయ్యారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..