AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Student: అమెరికా గన్‌కల్చర్‌.. దుండగుడి కాల్పులకు మరో తెలుగు విద్యార్థి బలి

అమెరికా గన్‌ కల్చర్‌కు మరో తెలుగు విద్యార్థి బలైపోయాడు. ఓ దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్ అనే విద్యార్థి బుల్లెట్‌ గాయాలతో మరణించాడు. చంద్రశేఖర్ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Telugu Student: అమెరికా గన్‌కల్చర్‌.. దుండగుడి కాల్పులకు మరో తెలుగు విద్యార్థి బలి
Hyderabad Student (1)
Anand T
|

Updated on: Oct 04, 2025 | 4:42 PM

Share

పై చదువుల కోసమని, ఉద్యోగాల కోసమని విదేశాలకు వెళ్తున్న యువత అక్కడ జరిగే గొడవలకు, కాల్పులకు, రోడ్డు ప్రమాదాలకు బలైపోతున్నారు. రోజురోజుకూ ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయో తప్పా, తగ్గట్లేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఆగ్రరాజ్యం అమెరికాలో మరోసారి వెలుగు చూసింది. ఒక దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఒక విద్యార్థి ప్రాణాలుకోల్పోయాడు. మృతుడు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన చంద్రశేఖర్‌గా గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీనగర్‌కు చెందిన చంద్రశేఖర్ స్వదేశంలో బీడీఎస్‌ పూర్తి చేసుకున్న తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. డాలస్ నగరంలో నివాసం ఉంటూ చదువుకుంటున్నాడు. అలాగే పెట్రోల్ బంకులో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఉదయం పెట్రోల్ పోసుకోవడానికి బంక్‌ వచ్చిన ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో ప్రమాదవశాత్తు బుల్లెట్‌ తగిలి చంద్రశేఖర్ మృతి చెందినట్టు తెలుస్తుంది.

ఇక కాల్పుల్లో చంద్రశేఖర్ మృతి చెందినట్టు తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పై చదువులకోసమని విదేశాలకు వెళ్లి కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడే అని గుండెలు పగిలేలా రోధించారు.చంద్రశేఖర్ మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..