IS Planning Terror Attack: భారత్ లో ఉగ్రదాడికి కుట్ర.. రష్యా అదుపులో ఉగ్రవాది..

భారత్ లో ఉగ్రదాడి కోసం ఇక్కడకు వచ్చేందుకు ప్రయత్నిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని రష్యా అదుపులోకి తీసుకుంది. ఈవిషయాన్ని రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB) వెల్లడించింది. రష్యా అదుపులోకి..

IS Planning Terror Attack: భారత్ లో ఉగ్రదాడికి కుట్ర.. రష్యా అదుపులో ఉగ్రవాది..
Terrorist
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 22, 2022 | 7:04 PM

IS Planning Terror Attack: భారత్ లో ఉగ్రదాడి కోసం ఇక్కడకు వచ్చేందుకు ప్రయత్నిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని రష్యా అదుపులోకి తీసుకుంది. ఈవిషయాన్ని రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB) వెల్లడించింది. రష్యా అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదిని మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భారత్ లో అధికార పార్టీకి చెందిన నాయకులపై దాడికోసం ఉగ్రవాది ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో తన ఉగ్రదాడికి అవసరమైన వివరాలను సేకరిస్తుండగా.. రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రష్యా నుంచి భారత్ వెళ్లడం కోసం అవసరమైన డాక్యుమెంటేషన్ పూర్తిచేసి, భారత్ లో హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులపై ఆత్మహుతి దాడులకు పాల్పడాలని ఇస్లామిక్ స్టేట్ నుంచి ఉన్న ఆదేశాలతోనే ఈదాడులకు ప్లాన్ చేసినట్లు రష్యా అధికారుల విచారణలో తేలింది.

ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఒకరు రిక్రూట్ చేసుకుని.. టర్కీలో సూసైడ్ బాంబర్ గా శిక్షణ ఇప్పించారని నిందితుడు తెలిపాడు. ఇలీవల కాలంలో భారత్ లో ఉగ్రదాడుల కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నా వాటిని భారత సైన్యం తిప్పికొడుతోంది. జమ్మూ కశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని ఆర్మీ పట్టుకుంది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ భారత్ లో ఆత్మహుతి దాడికి పాల్పడేందుకు తబ్రక్ హుస్సేన్ అనే వ్యక్తిని సరిహద్దు దాటించగా.. ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..