AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో నాకు సంబంధం లేదు.. ఆరోపణలపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత

బిల్కిస్‌ బానో, ఇతర అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కవిత స్పష్టం చేశారు. బిల్కిస్ బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగాలేదని విమర్శించారు.

Liquor scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో నాకు సంబంధం లేదు.. ఆరోపణలపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత
Mlc Kavitha
Jyothi Gadda
|

Updated on: Aug 22, 2022 | 2:12 PM

Share

Liquor scam : ఢిల్లీ మద్యం పాలసీ తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. లిక్కర్‌ పాలసీ కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌ పైన, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవితపైన డైరెక్ట్‌ ఎటాక్‌ చేశారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక కవిత హస్తం ఉందని.. మద్యం వ్యాపారంలో కమీషన్ల కోసమే ఆమె ఈ కుంభకోణంలో ఎంటరయ్యారన్నారు బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ.కేసీఆర్‌ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందిందని.. ఈ విధానం రూపకల్పనకు సంబంధించిన భేటీలకు వారు కూడా హాజరయ్యారని ఆరోపించారు. దీనిపై స్పందించారు నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికపక్ష పార్టీల మీద అధికారిక బీజేపీ కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదన్నారు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత. రంగారెడ్డి ఎలిమనేడులో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నాలుగు రోజులుగా సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు కవిత యాగానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో కవిత మాట్లాడారు. బీజేపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. తాను మానసికంగా కుంగిపోతానని అనుకుంటున్నారన్నారు. కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే, కేసీఆర్ ఆగమైతడని, కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్న కేసీఆర్ భయపడాతారని బీజేపీ నేతలు ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది పూర్తి వ్యర్థ ప్రయత్నంగానే మిగిలిపోతుందన్నారు కవిత.

ఇవి కూడా చదవండి

బిల్కిస్‌ బానో, ఇతర అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కవిత స్పష్టం చేశారు. బిల్కిస్ బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగాలేదని విమర్శించారు. బీజేపీ వైఖరిని ప్రజలు గమనించాలని చెప్పారు. కేంద్రంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంత ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు. భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే కలతో, ఎజెండాతో సీఎం కేసీఆర్ గారు ముందుకెళ్తున్నారు. మేమంతా వారు చూపించిన బాటలోనే నడుస్తామని, భయపడేది లేదన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి