AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా ‘భారత సంతతి వ్యక్తి’.. ఫలించిన రిషి సునాక్ సంకల్పం..

ప్రపంచమంతా భారతీయ శక్తిని గుర్తిస్తోంది. 200 ఏళ్ల పాటు భారత్‌ను పాలించిన బ్రిటన్‌కు తొలిసారిగా భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్‌ ప్రధాని అయ్యారు. దీంతో ఇతర దేశాల్లో అత్యంత ప్రధాన్యత ఉన్న పదవుల్లో..

Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా 'భారత సంతతి వ్యక్తి'.. ఫలించిన రిషి సునాక్ సంకల్పం..
Rishi Sunak
Amarnadh Daneti
|

Updated on: Oct 24, 2022 | 6:41 PM

Share

జయహో భారత్.. ప్రపంచమంతా భారతీయ శక్తిని గుర్తిస్తోంది. 200 ఏళ్ల పాటు భారత్‌ను పాలించిన బ్రిటన్‌కు తొలిసారిగా భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్‌ ప్రధాని అయ్యారు. దీంతో ఇతర దేశాల్లో అత్యంత ప్రధాన్యత ఉన్న పదవుల్లో ఉన్న నాలుగో వ్యక్తిగా రిషి సునాక్ రికార్డు సృష్టించారు. 193 మంది కన్జర్వేటివ్ ఎంపీలు రిషి సనాక్‌కు మద్దతు ప్రకటించారు. ఈనెల 28వ తేదీన రిషి సనాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. బ్రిటన్ కొత్త ప్రధానిగా మాజీ ఆర్థిక మంత్రి, కన్జర్వేటివ్ నేత రిషి సునాక్ ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో రిషి సునాక్ కు మార్గం సుగమమైంది. ప్రస్తుతం పెన్నీ మోర్డాంట్ మాత్రమే ప్రధాని రేసులో సునాక్ తో పోటీకి నిలిచారు. అయితే, రేసులో నిలవాలంటే కనీసం వంద మంది ఎంపీల మద్దతును ఆమె కూడగట్టాల్సి ఉంటుంది. దానికి సోమవారం మధ్యాహ్నం రెండు గంటలతో వ్యవధి ముగిసింది. గడువు ముగిసాక ఆమెకు పోటీలో నిలిచేందుకు అవసరమైన ఎంపీల మద్దతు లభించకపోవడంతో రిషి సునాక్ గెలుపు సునాయసమైంది. ఇటీవలే రిషి సునాక్ ప్రధానమంత్రి అవుతారని భావించారు. అయితే లిజ్ ట్రస్ కుఎక్కువ మంది మద్దతు పలకడంతో ఆమె బ్రిటన్ ప్రధాని అయ్యారు. బోరిస్ జాన్సన్ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచి బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన లిజ్ ట్రస్ కేవలం 45 రోజులకే రాజీనామా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం కావడంతో ట్రస్ పై ప్రజలతో పాటు సొంత పార్టీ నేతల్లోనూ అసంతృప్తి నెలకొంది. వరుసగా తన కేబినెట్ లోని మంత్రులు రాజీనామాలు చేయడంతో గత్యంతరం లేక లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో బ్రిటన్ లో మరోసారి ప్రధాని పదవికి ఎన్నికలు అనివార్యంగా మారాయి. అయితే పోటీలో నిలిచేందుకు మద్దతు కూడగట్టడంలో పెన్నీ మోర్డాంట్ విఫలం కావడంతో ఆయన తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమమైంది.

రిషి సునాక్ ప్రస్థానం

42 ఏళ్ల రిషి సునాక్‌ను బోరిస్ జాన్సన్‌ 2020 ఫిబ్రవరిలో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్‌గా నియమించారు. దీంతో రిషి సునాక్‌ తొలిసారి పూర్తిస్థాయి కేబినెట్ హోదా పొందారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం 10 బిలియన్ పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీని ప్రకటించి ఒక్కసారిగా ఆయన వెలుగులోకి వచ్చారు. డిషి పేరుతో ఆయన అందరికి సుపరిచితం. కరోనా సమయంలో డౌనింగ్ స్ట్రీట్‌లోని జరిగిన ప్రధాని బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నందుకు గాను జరిమానాను కూడా ఎదుర్కొన్నారు. రిషి సునక్ పూర్వీకులు పంజాబ్ నుంచి బ్రిటన్‌కు వలస వచ్చారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తి ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునాక్, అనౌష్క సునాక్ ఉన్నారు.

రాజీనామా సందర్భంగా బోరిస్ జాన్సన్ పని చేసే విధానాన్ని సునక్ ప్రశ్నించారు. జాన్సన్‌పై ప్రశ్నల వ‌ర్షం కురిపించారు. ప్రభుత్వాన్ని సక్రమంగా, సీరియస్‌గా, సమర్ధవంతంగా నడపాలని ప్రజలు ఆశిస్తున్నారని, అయితే.. అలా వ్యవహరించ‌డంలో చాలాసార్లు విఫ‌ల‌మైంద‌ని అన్నారు. మంత్రిగా ఇది త‌న‌ చివరి ఉద్యోగం కావచ్చున‌ని అన్నారు. కానీ ప్రభుత్వంలో మెరుగైన‌ ప్రమాణాల కోసం పోరాటం చేస్తాన‌నీ, ప్రధాన మంత్రి బోరిస్ మంత్రివర్గం నుంచి తాను రాజీనామా చేయడానికి కారణం ఇదేన‌ని తెలిపారు.

ఇవి కూడా చదవండి

రిషి సునాక్ పై ఆరోపణలు

రిషి సనక్‌పై పలు ఆరోపణలు కూడా వచ్చాయి. . రష్యాలో ఇన్ఫోసిస్ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాల్లో అక్షతా మూర్తి భాగస్వామి అని, యూకేలో పన్ను చెల్లించడం లేదని రిషి సునాక్, అక్షతా మూర్తిపై విమర్శలు వచ్చాయి. త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై రిషి సునాక్ గతంలో బోరిస్ జాన్సన్‌కు లేఖ రాశారు. కుటుంబ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మంత్రివర్గ ప్రకటనల నిబంధనలను తాను పాటించాలా వద్దా అని సమీక్షించాలని ఆ లేఖలో ఆయన ప్రధానిని కోరారు. ఎల్లప్పుడూ నిబంధనలను అనుసరిస్తాననీ, త‌మ ఆర్థిక వ్యవహ‌రాల‌పై సమీక్ష నిర్వహించాలని, దీంతో మరింత స్పష్టత వ‌స్తుంద‌ని తెలిపారు.

రిషి సునక్ భార్య అక్షతా మూర్తి.. ఆమె ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కుమార్తె. వివాదం తర్వాత.. అక్షత తన ఆదాయంపై యూకేలో పన్ను చెల్లిస్తానని ప్రకటించింది. తన గ్లోబల్ ఆదాయంపై యూకేలో పన్ను చెల్లించాలనే నిర్ణయం భారతదేశం పుట్టిన ప్రదేశం, పౌరసత్వం, తల్లిదండ్రుల ఇల్లు, నివాస స్థలం అనే వాస్తవాన్ని మార్చదని అక్షత ట్వీట్ చేసింది, కానీ, ఆమె బ్రిటన్‌ను కూడా ప్రేమిస్తున్నాన‌నీ ప్రకటించారు.

రిషి సునాక్ ముందు ఎన్నో సవాళ్లు..

బ్రిటన్ ప్రధాని కావడంతో రిషి సునాక్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి. అయితే అన్నింటికి తన వద్ద పరిష్కారం ఉందని గతంలో రిషి సునాక్ చెప్పాడు. ప్రధాని బాధ్యతలు అధికారికంగా చేపట్టిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..