Unique Couple: వరుడికి 60 ఏళ్ళు, వధువు 19 ఏళ్లు.. రిక్షా ప్రయాణంలో చిగురించిన ప్రేమ

షకీల్ రిక్షా నడుపుతున్నప్పుడు.. సమీనా అతనితో ప్రేమలో పడింది. అతనికి పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసింది. రిక్షా నడుపుతూ సమీనాను కలిశానని షకీల్ చెప్పాడు. తన రిక్షాలో కూర్చొని సమీనా ఎక్కడికో వెళుతోంది.

Unique Couple: వరుడికి 60 ఏళ్ళు, వధువు 19 ఏళ్లు.. రిక్షా ప్రయాణంలో చిగురించిన ప్రేమ
Unique Couple In Pak
Follow us
Surya Kala

|

Updated on: Jan 03, 2023 | 5:52 PM

ప్రేమకు హద్దులు ఉండవని అంటారు.  ప్రేమ, ఆస్తులు, అంతస్తులు, డబ్బు, వయసు ఇలా వీటిని లెక్కచేయదు. అన్ని పరిమితులకు మించినది ప్రేమ. అందుకే గత కొంతకాలంగా రకరకాల ప్రేమ కథలు తెరపైకి వస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రేమ ఎల్లలు దాటింది. ఇతర దేశాల్లో నివసించే వారు కూడా ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకుంటారు. ప్రేమకు వయసు లేదని..  ప్రేమ ఏ వయసులోనైనా కలుగుతుందని.. ఆ ప్రేమ పెళ్లి చేసుకుని జన్మల అను బంధంగా మార్చుకుంటున్న జంటల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.. అయితే 10-15 ఏళ్ల మధ్య తేడా ఉన్న చాలా మంది జంటల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ జంట ప్రేమ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఈ జంట మధ్య వయసు తేడా 41 ఏళ్లు.  ఈ యునిక్ లవ్ స్టోరీ పాకిస్థాన్‌కు చెందినది. అయితే ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది.

వాస్తవానికి..  పాకిస్తాన్‌ యూట్యూబర్ సయ్యద్ బాసిత్ అలీ ఈ ప్రత్యేకమైన జంటను ఇంటర్వ్యూ చేసి.. ఈ జంట ప్రేమ కథను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ జంట పాకిస్తాన్ కి చెందినవారు. ప్రేమలో పడి ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. ఇక్కడ  విశేషమేమిటంటే.. , భర్త వయస్సు 60 సంవత్సరాలు.. భార్య వయస్సు 19 సంవత్సరాలు మాత్రమే, అంటే ఇద్దరి వయస్సు మధ్య 41 సంవత్సరాల తేడా ఉంది.

సయ్యద్ బాసిత్ అలీ చెప్పిన ప్రకారం..  60 ఏళ్ల భర్త పేరు షకీల్ కాగా.. అతని 19 ఏళ్ల భార్య పేరు సమీనా. వీరి ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. షకీల్ రిక్షా నడుపుతాడు. షకీల్ రిక్షా నడుపుతున్నప్పుడు.. సమీనా అతనితో ప్రేమలో పడింది. అతనికి పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసింది. రిక్షా నడుపుతూ సమీనాను కలిశానని షకీల్ చెప్పాడు. తన రిక్షాలో కూర్చొని సమీనా ఎక్కడికో వెళుతోంది. అయితే మార్గమధ్యంలో రిక్షా విరిగిపోయింది.

ఇవి కూడా చదవండి

అలాంటి పరిస్థితిలో సమీనాకి డబ్బులు ఇచ్చి వేరే రిక్షాలో వెళ్ళమని షకీల్ కోరాడు. అయితే అప్పుడు సమీనా ఆ డబ్బులను తీసుకోకుండా.. షకీల్ తిరిగి ఇంటికి వెళ్ళడానికి ప్రయాణానికి కావాల్సిన డబ్బు ఇవ్వడమే కాకుండా అతని  రిక్షా రిపేర్ కు అయ్యే ఖర్చులను కూడా ఇచ్చింది. సమీనా మంచి మనసుకి షకీల్ దాసోహం అన్నాడు. దీంతో అప్పటి నుంచి సమీనాను తన రిక్షాలోనే ఎక్కడికైనా తీసుకుని వెళ్లడం ప్రారంభించాడు. ఇలా సమీనా నుంచి  సుమారు 2-3 నెలలు డబ్బు తీసుకోలేదు. ఈ ప్రయాణం సమయంలో ఇద్దరూ మాట్లాడుకునేవారు. చివరకు సమీనా తాను షకీల్ ను ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసింది. అనంతరం వారిద్దరూ వివాహం చేసుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..