R.1 COVID Variant: మానవాళిపై పగబట్టిన కోవిడ్.. కొత్తవేరియంట్ గుర్తింపు.. 35 దేశాల్లో 10వేల మంది బాధితులు
COVID-19 New Variant R.1: మనవాళిపై పగబట్టిన కరోనా వైరస్ చైనాలో పుట్టి.. ప్రపంచ దేశాలను గత ఏడాదిన్నరకు పైగా వణికిస్తోంది. జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్న ఈ కరోనా వైరస్ కు..
COVID-19 New Variant R.1: మనవాళిపై పగబట్టిన కరోనా వైరస్ చైనాలో పుట్టి.. ప్రపంచ దేశాలను గత ఏడాదిన్నరకు పైగా వణికిస్తోంది. జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్న ఈ కరోనా వైరస్ కు కట్టడి కోసం ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. కొని దేశాలు టీకాలు ఇవ్వడం పూర్తి చేసుకున్నాయి.. ఇక మరొకొన్ని దేశాలు లాక్ డౌన్, కోవిడ్ నిబంధనలతో ఈ వైరస్ ను అదుపులులోకి తెచ్చామని ప్రకటించినంత సేవు ఆనందం ఉంచడం లేదు ఈ మహమ్మారి. అనేక రూపాలను మార్చుకుంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తూనే ఉంది. దీంతో కరోనా కొత్త కేసుల నమోదులో హెచ్చతగ్గులు ఏర్పడుతున్నాయి.
మెక్సికో, కొన్ని పశ్చిమాసియా దేశాల్లో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం కాగా.. మన దేశంలో కూడా థర్డ్ వేవ్ ముప్పు ముంచి ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వైద్య సిబ్బంది ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ లో భాగంగా మరో వేరియంట్ వెలుగులోకి వచ్చింది. దీనిపేరు ఆర్.1 .. ఇప్పటికే ఈ వేరియంట్ కేసులు కొన్ని దేశాల్లో నమోదయాయ్యి. ఇప్పటివరకు అగ్రరాజ్యం అమెరికా సహా 35 దేశాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఈ దేశాల్లో ఆర్ 1 వేరియంట్ బారిన పడి 10 వేలమంది రోజులు చికిత్స తీసుకుంటున్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది. అయితే ఈ ఆర్ వన్ వేరియంట్ ప్రమాదకారి కాదని.. వ్యాక్సిన్ తో అదుపు చేయవచ్చని అంటున్నారు. ఈ వేరియంట్ బారినపడిన వారు కంగారు పడకుండా చికిత్స తీసుకుంటూ.. కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మరో వైపు మనదేశం మూడో దశ ప్రారంభం కాకుండానే వీలైనంత మందికి వ్యాక్సిన్ అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. రోజు రోజుకీ టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు. అంతేకాదు కొన్ని రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు.
Also Read: తుమకూరు మఠానికి 13 ఏళ్ల బాలుడు మఠాధిపతిగా ఎంపిక.. చదువుతూనే బాధ్యతలు నిర్వహిస్తాడన్న పెద్దలు..