AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor: భారత్ ఆపరేషన్ సిందూర్‌పై చైనా షాకింగ్ రియాక్షన్..

ఆపరేషన్ సిందూర్, తాజా పరిణామాలపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది.. అణ్వాయుధాలు కలిగిన పొరుగు దేశాల మధ్య భీకర ఉద్రిక్తతకు ప్రతిస్పందనగా.. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది. పాకిస్తాన్‌కు సన్నిహిత మిత్రదేశమైన చైనా రెండు దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటుంది. ఈ క్రమంలో కీలక ప్రకటన చేసింది.

Operation Sindoor: భారత్ ఆపరేషన్ సిందూర్‌పై చైనా షాకింగ్ రియాక్షన్..
India China
Shaik Madar Saheb
|

Updated on: May 07, 2025 | 10:29 AM

Share

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారతదేశం బుధవారం “ఆపరేషన్ సిందూర్”ను ప్రారంభించింది. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాల ప్రదేశాలపై దాడి చేసింది. ఒకేసారి తొమ్మిది ఉగ్రవాద శిబిరాల టార్గెట్స్‌పై బాంబుల వర్షం కురిపించింది.. పాకిస్తాన్‌లో 4.. పీవోకేలో 5 చోట్ల ఎటాక్స్‌ చేసింది.. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో అర్థరాత్రి ఒంటిగంట తర్వాత మెరుపు దాడులు చేసింది పాకిస్తాన్‌తోపాటు పీవోకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్‌లో మిస్సైళ్ల వర్షం కురిపించింది.. భారత్‌ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది..

అయితే.. తాజా పరిణామాలపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది.. అణ్వాయుధాలు కలిగిన పొరుగు దేశాల మధ్య భీకర ఉద్రిక్తతకు ప్రతిస్పందనగా.. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది. పాకిస్తాన్‌కు సన్నిహిత మిత్రదేశమైన చైనా రెండు దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటుంది. ఈ ఉదయం పాకిస్తాన్ పై భారతదేశం సైనిక చర్యపై బీజింగ్ విచారం వ్యక్తం చేసింది.. ప్రస్తుత పరిణామాల గురించి ఆందోళన చెందుతుందుతున్నామని.. పేర్కొంది. ఇరు దేశాలు శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.

“భారతదేశం – పాకిస్తాన్ పొరుగు దేశాలు, వాటిని వేరు చేయలేము.. వారు చైనా పొరుగువారు కూడా. చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

“భారతదేశం – పాకిస్తాన్ రెండూ శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రశాంతంగా… సంయమనంతో ఉండాలని.. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను తీసుకోకుండా ఉండాలని మేము కోరుతున్నాము” అని ప్రతినిధి జోడించారు.

ఇజ్రాయెల్ మద్దతు..

ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ఇజ్రాయెల్ మద్దతు తెలిపింది. ఆపరేషన్ సింధూర్‌ను సమర్థిస్తూ ఇజ్రాయెల్ ట్వీట్ చేసింది. ఉగ్రవాదులపై భారత సైనిక చర్యలు సరైనవే అని చెప్పింది. ఈ మేరకు ఇజ్రాయెల్ అంబాసిడర్ రూవెన్ అజర్ ట్వీట్ చేశారు.

ఎప్పటికప్పుడు క్లోజ్‌గా మానిటర్‌: అమెరికా

భారత్‌ ఆపరేషన్‌పై ఎప్పటికప్పుడు క్లోజ్‌గా మానిటర్‌ చేస్తున్నామన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. భారత్ యాక్షన్‌కి కౌంటర్‌గా పాక్‌ ఎటువంటి చర్య తీసుకోవద్దు.. భారత్‌పై యుద్ధానికి పాక్ ధైర్యం చెయ్యొద్దన్నారు. ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్‌కి ఉంది.. ఆపరేషన్ సింధూర్‌పై పాక్‌ మౌనంగా ఉంటే మంచిదని సూచించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్రెండ్‌ కోసం సూపర్‌‌ హిట్ కథ వదులుకున్న ప్రభాస్‌
ఫ్రెండ్‌ కోసం సూపర్‌‌ హిట్ కథ వదులుకున్న ప్రభాస్‌
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్.. ఆ తోపు టీంలకే సాధ్యంకాలే
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్.. ఆ తోపు టీంలకే సాధ్యంకాలే
సడెన్‌గా కాఫీ తాగడం మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులేంటి? వాటికి
సడెన్‌గా కాఫీ తాగడం మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులేంటి? వాటికి
పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా
పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా
ఎన్టీఆర్ పితృ సమానులుగా భావించింది ఆయన్నే...
ఎన్టీఆర్ పితృ సమానులుగా భావించింది ఆయన్నే...
అకాల మరణం పొందితే ఆ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతాయా.. గరుడ పురాణం..
అకాల మరణం పొందితే ఆ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతాయా.. గరుడ పురాణం..
ఒకప్పుడు బాత్రూమ్స్ కడిగాడు.. ఇప్పుడీ జబర్దస్త్ నటుడు కోటీశ్వరుడు
ఒకప్పుడు బాత్రూమ్స్ కడిగాడు.. ఇప్పుడీ జబర్దస్త్ నటుడు కోటీశ్వరుడు
శ్రీవారి సన్నిధిలో ఫోటో షూట్.. క్షమాపణ చెప్పిన కొత్తజంట
శ్రీవారి సన్నిధిలో ఫోటో షూట్.. క్షమాపణ చెప్పిన కొత్తజంట
చికెన్ 65 కి అసలు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
చికెన్ 65 కి అసలు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
నుమాయిష్‌లో వంటల పోటీలు.. మీ చేతి రుచి చూపేందుకు సిద్దమా?
నుమాయిష్‌లో వంటల పోటీలు.. మీ చేతి రుచి చూపేందుకు సిద్దమా?