AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tornado: బీభత్సం సృష్టించిన శక్తివంతమైన సుడిగాలి.. భారీగా నష్టం.. విద్యుత్‌ వైర్లు నేలమట్టం.. వీడియోలు చూస్తే షాకే..!

Tornado: దక్షిణ చైనాలోని ఫోషాన్ నగరాన్ని ఆదివారం శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేసింది. భారత కాలమానం ప్రకారం.. ఉదయం 7.20 గంటల ప్రాంతంలో ఈ ట్విస్టర్‌కి సంబంధించిన..

Tornado: బీభత్సం సృష్టించిన శక్తివంతమైన సుడిగాలి.. భారీగా నష్టం.. విద్యుత్‌ వైర్లు నేలమట్టం.. వీడియోలు చూస్తే షాకే..!
Subhash Goud
|

Updated on: Jun 21, 2022 | 1:59 PM

Share

Tornado: దక్షిణ చైనాలోని ఫోషాన్ నగరాన్ని ఆదివారం శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేసింది. భారత కాలమానం ప్రకారం.. ఉదయం 7.20 గంటల ప్రాంతంలో ఈ ట్విస్టర్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బీభత్సం సృష్టించిన ఈ సుడిగాలి ఒక్క నిమిషంలోనే విద్యుత్తు అంతరాయానికి కారణమైంది. ఈ సుడిగాలి తాకిడికి చెట్లన్ని నేలకూలాయి. ఇళ్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇవి కూడా చదవండి

కొన్ని వీడియోలలో ట్విస్టర్ విద్యుత్ లైన్లను కూల్చడంతో ఆకస్మికంగా మంటలతో పాటు నిప్పురవ్వలు చెలరేగినట్లు ఈ వీడియోలో చూడవచ్చు. ఆకస్మిక వాతావరణ సంఘటనతో భవనాలు, కార్లు, స్థానిక మౌలిక సదుపాయాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయి.

అయితే గత వారం దేశాన్ని తాకిన రెండో సుడిగాలి ఇది. జూన్ 16న దక్షిణ మెగాసిటీ గ్వాంగ్‌జౌను మరో సుడిగాలి తాకింది. లక్షలాది మంది ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. పెద్ద ఎత్తున ఆస్తులను నాశనం చేసింది. వ్యవసాయ భూములను చిత్తడి చేసింది.

జూన్‌లో వసంతకాలం నుండి వేసవికి కాలానుగుణ పరివర్తనను సూచించే వర్షాకాలానికి ముందు అధికారులు ఏప్రిల్‌లోనే “తీవ్ర వాతావరణ సంఘటనల” హెచ్చరికలను జారీ చేశారు. చైనా వరదలకు గురవుతుంది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. అనేక ఎకరాల వ్యవసాయ భూములను నష్టపోయేలా చేసింది.