Israel: ఇజ్రాయెల్ లో పార్లమెంట్ రద్దు.. మూడేళ్లలో ఐదోసారి ఎన్నికలకు సిద్ధం
ఇజ్రాయెల్(Israel) లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశ పార్లమెంట్ రద్దు అవడంతో ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్న నాఫ్తాలీ బెన్నెట్ సైతం ఆ పదవి నుంచి తొలగిపోనున్నారు. ఎనిమిది పార్టీలతో కలిసి ఏర్పడిన ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో....
ఇజ్రాయెల్(Israel) లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశ పార్లమెంట్ రద్దు అవడంతో ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్న నాఫ్తాలీ బెన్నెట్ సైతం ఆ పదవి నుంచి తొలగిపోనున్నారు. ఎనిమిది పార్టీలతో కలిసి ఏర్పడిన ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో బెన్నెట్ విఫలమయ్యారు. రెండు నెలలుగా పార్లమెంట్లో మెజారిటీ లేకుండానే అధికారంలో ఉన్నారు. ఈ తరుణంలో తాజాగా చర్చలు నిర్వహించారు. ఈ చర్చలు పార్లమంట్ రద్దుకు కారణమయ్యాయి. ఫలితంగా దేశంలో త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తు్న్నారు. కాగా మూడేళ్ల వ్యవధిలో ఐదోసారి ఎన్నికలు జరగడం గమనార్హం. 12ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బెంజిమిన్ నెతన్యాహును గద్దె దించతూ గతేడాది జనవరిలో ఇజ్రాయెల్ ప్రధానిగా నాఫ్తాలి బెన్నెట్ అధికారం చేపట్టారు.తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడపడానికి అన్ని మార్గాలూ మూసుకుపోయాయని బెన్నెట్ వెల్లడించారు. కూటమిలోని సభ్యుల మధ్య ఇటీవల తీవ్ర విభేదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు పూర్తయి, కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ లాపిడ్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా కొనసాగనున్నారు.
ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు, పార్లమెంటు రద్దు అవకుండా చూసుకునేందుకు చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. బడ్జెట్ ఒప్పందంపై సంకీర్ణ ప్రభుత్వంలోని రెండు ప్రధాన పార్టీల మధ్య చర్చలు సఫలం కాలేదు. మేలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్ మధ్య వివాదం జరిగింది. 2021 బడ్జెట్‌పై ఒప్పందం కుదుర్చుకోవడానికి నెతన్యాహు మరియు గాంట్జ్ మంగళవారం నాటికి బడ్జెట్ ఆమోదించే గడువును మరో రెండు వారాల వరకు పొడిగించాలని ప్రతిపాదించారు. అయితే రెండు పార్టీల సభ్యులు మాత్రమే పార్లమెంటులో ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి