Muslim Marriages: ముస్లిం అమ్మాయిల పెళ్లి వయసుపై హైకోర్టు సంచలన ఆదేశాలు

Muslim Marriages: ముస్లిం యువతుల వివాహనాలపై పంజాబ్‌, హర్యానా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 16 సంవత్సరాలు నిండిన ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం..

Muslim Marriages: ముస్లిం అమ్మాయిల పెళ్లి వయసుపై హైకోర్టు సంచలన ఆదేశాలు
Follow us
Subhash Goud

|

Updated on: Jun 20, 2022 | 1:26 PM

Muslim Marriages: ముస్లిం యువతుల వివాహనాలపై పంజాబ్‌, హర్యానా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 16 సంవత్సరాలు నిండిన ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకోవచ్చని పేర్కొంది.21 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల యువతి కుటుంబ సభ్యుల నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ముస్లిం దంపతుల రక్షణ పిటిషన్‌ను జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ ధర్మాసనం విచారిస్తూ ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసులో దంపతులే పిటిషనర్లుగా ఉన్నారు. జస్టిస్‌ బేడి షరియా చట్టాన్ని ప్రస్తావించారు. ముస్లిం అమ్మాయి వివాహం ముస్లిం వ్యక్తిగత చట్టం ద్వారా నిర్వహించబడుతుందని అన్నారు. అయితే ఈ దంపతులు కొంతకాలం క్రితం ప్రేమలో పడి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి వివాహం జూన్ 8, 2022న ముస్లిం ఆచారాల ప్రకారం ఘనంగా జరిగింది.

పిటిషనర్ జంట, వారి న్యాయవాది ద్వారా, ముస్లిం చట్టంలో, యుక్తవయస్సు, మెజారిటీ ఒకటేనని, ఒక వ్యక్తి 15 ఏళ్ల వయస్సులో మెజారిటీని పొందుతారని ఒక భావన ఉందని వాదించారు. యుక్తవయసుకు వచ్చిన ముస్లిం అబ్బాయి లేదా అమ్మాయి తాము ఇష్టపడే వారిని వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉందని కోర్టు వెల్లడించింది. సంరక్షకుడికి జోక్యం చేసుకునే హక్కు లేదని వాదించారు. అలాగే, తమ ప్రాణాలకు ముప్పు ఉందని, ఆ జంట పఠాన్‌కోట్‌లోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు.

సర్ దిన్‌షా ఫర్దుంజీ మొల్లా రాసిన ‘ప్రిన్సిపుల్స్ ఆఫ్ మొహమ్మదీన్ లా’ పుస్తకంలోని సెక్షన్ 195 ప్రకారం 16 ఏళ్లు పైబడిన అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు. ఇక వరుడి వయస్సు కూడా 21 ఏళ్లు దాటినందున ఈ వివాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. దీని తర్వాత న్యాయమూర్తి దంపతుల భద్రత విషయంలో పఠాన్‌కోట్ పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇష్టపూర్వకంగా చేసుకున్న పెళ్లి చెల్లుతుందని, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించలేమని కోర్టు స్పష్టం చేసింది. తన తీర్పులో ముస్లిం వ్యక్తిగత చట్టంపై దిన్షా ఫర్దూన్ జీ రాసిన పుస్తకాన్ని ఉదహరించారు న్యాయమూర్తి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం