Thunderstorm: పిడుగుల వర్షానికి 21 మంది బలి.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..!

Thunderstorm: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ప్రకటించింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. బీహార్‌లో పిడుగుపాటుకు..

Thunderstorm: పిడుగుల వర్షానికి 21 మంది బలి.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..!
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Jun 20, 2022 | 11:26 AM

Thunderstorm: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ప్రకటించింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. బీహార్‌లో పిడుగుపాటుకు 17 మంది దుర్మరణం చెందారు. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఉరుములు, పిడుగులతో కురిసిన వర్షానికి భాగల్‌పూర్‌లో ఆరుగురు, వైశాలి జిల్లాలో ముగ్గురు, ఖగారియాలో ఇద్దరు, బంకాలో ఇద్దరు, కతిహార్‌లో ఒకరు, సహర్సాలో ఒకరు, మాధేపురాలో ఒకరు, ముంగేర్‌లో ఒకరు మృతి చెందారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పిలుడు పాటుకు నలుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటుకు మృతి చెందిన వారు అత్యధికంగా వ్యవసాయ పనులు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారున్నారు.

అప్రమత్తంగా ఉండాలి..

ప్రతికూల వాతావరణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచనలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌తో పాటు బీహార్‌లో ముందుకు కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఉత్తర, మధ్య, తూర్పు భారతం అంతటా రెండు మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి