Bharat Bandh Live: అగ్నిపథ్‌పై భారత్ బంద్.. రైల్వే స్టేషన్లలో హైఅలర్ట్
Agnipath Protest Bharat Bandh Today Live Updates :అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ నిరసన: కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో హింసాత్మక ప్రదర్శనలు జరుగుతున్నాయి..
Agnipath Protest Bharat Bandh Today Live Updates: కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో హింసాత్మక ప్రదర్శనలు జరుగుతున్నాయి. యువత ప్రారంభించిన నిరసనలో రాజకీయ పార్టీలు కూడా చేరాయి. కాగా, సోమవారం కొన్ని సంస్థల తరపున భారత్ బంద్ కొనసాగుతోంది. భారత్ బంద్ నేపథ్యంలో పలు చోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP) హైఅలర్ట్‌లో ఉన్నారు. అల్లర్లు సృష్టించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని యువకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునేది లేదని సైన్యం స్పష్టం చేసింది.
ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. నేడు 2 వేల మందికిపైగా పోలీసులు నగరంలో పహారా కాస్తారని అధికారులు తెలిపారు. అంతేకాదు, బంద్ సందర్భంగా హింసకు పాల్పడే వారిని గుర్తించేందుకు వీడియోలు కూడా తీయనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఝార్ఖండ్‌లో నేడు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బంద్ సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.
ఢిల్లీ నుంచి నడిచే 71 రైళ్లు రద్దు అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా భారీ నిరసనల కారణంగా అనేక రైళ్లు రద్దు చేసింది రైల్వే శాఖ. రైళ్ల రద్దు కారణంగా చాలా మంది ప్రయాణికులు చిక్కుకుపోవడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్ కమాండోలను మోహరించారు. ఢిల్లీ నుంచి నడిచే 71 రైళ్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
LIVE NEWS & UPDATES
-
సైనికులను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అవమానించారు
అగ్నిపథ్‌పై కేంద్రం తీరును తప్పుబట్టారు మంత్రి హరీష్‌రావు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అవమానించారన్నారు. దేశ యువతకు చెప్పేది ఇదేనా అని ప్రశ్నించారు. అగ్నిపథ్ పేరుతో ఆర్మీని ప్రైవేటీకరించేస్తున్నారని వ్యాఖ్యానించారు.
-
రాష్ట్రపతిభవన్ వరకు కాంగ్రెస్ ర్యాలీ
ఆర్మీలో అగ్నిపథ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ నుంచి రాష్ట్రపతిభవన్ వరకు ర్యాలీ చేపట్టారు. అగ్నిపథ్ స్కీమును రద్దు చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు వినతి పత్రం ఇస్తున్నారు కాంగ్రెస్ ఎంపీలు.
-
-
ఆర్మీలో అగ్నిపథ్ తొలి నోటిఫికేషన్ విడుదల..
అగ్నిపథ్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు నోటిషికేషన్ విడుదల చేసింది ఆర్మీ. అంతేగాక ఎయిర్‌ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీర్ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది. మంగళవారం ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్.. ఈనెల 24న ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రోజు నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.
Indian Army issues notification for Agniveer recruitment rally, registration to open from July onwards#AgnipathScheme pic.twitter.com/VnrAiOXibU
— ANI (@ANI) June 20, 2022
-
రైల్వే స్టేషన్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్
పంజాబ్‌లోని జలంధర్ రైల్వే స్టేషన్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా భారీగా మోహరించారు పోలీసులు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పంజాబ్ సాయుధ పోలీసులు కూడా ఉన్నారు.
-
నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో భారీ భద్రత
ఢిల్లీ: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భారత్ బంద్ పిలుపు మేరకు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో భద్రతను పెంచారు. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ప్రజలు, రైల్వే ఆస్తుల భద్రతకు భద్రత కల్పించడానికి భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. రైళ్లును నడుపుతున్నారు.
-
-
ఆ నగరాల్లో కనిపించని బంద్ ప్రభావం
ముంబై, లక్నో, హైదరాబాద్ సహా పలు పెద్ద నగరాల్లో భారత్ బంద్ ప్రభావం కనిపించనప్పటికీ దేశంలోని పలు రాష్ట్రాలు, నగరాల్లో బంద్ ప్రభావం కనిపిస్తోంది. బంద్ ప్రభావం ఢిల్లీలో కూడా కనిపిస్తోంది. రాజధాని సహా ఎన్‌సిఆర్‌లోని చాలా చోట్ల భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.
-
జంతర్‌మంతర్ దగ్గర కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
ఢిల్లీ: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ దగ్గర కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జంతర్‌మంతర్ వద్ద కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట నెలకొంది. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
-
ట్రాఫిక్ జామ్
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బంద్ సందర్భంగా నోయిడాలోని చిల్లా సరిహద్దు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అగ్నిపథ్ పథకానికి నిరసనగా కొన్ని సంస్థలు దేశవ్యాప్తంగా ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో చిల్లా సరిహద్దు వద్ద నోయిడా-ఢిల్లీ లింక్ రోడ్డుపై సుదీర్ఘ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
#WATCH नोएडा: अग्निपथ योजना के विरोध में कुछ संगठनों द्वारा देशभर में ‘भारत बंद’ के आह्वान के बीच चिल्ला बॉर्डर पर नोएडा-दिल्ली लिंक रोड पर लंबा ट्रैफिक जाम देखा गया। pic.twitter.com/OIczXZaJNA
— ANI_HindiNews (@AHindinews) June 20, 2022
ఎలాంటి అల్లర్లకు చోటివ్వకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.
-
హైదరాబాద్‌లో కనిపించని భారత్ బంద్ ప్రభావం
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మాత్రం బంద్ ప్రభావం పెద్దగా కనింపించడం లేదు. యధావిధిగా రైళ్లు, బస్సులు తిరుగుతున్నాయి.
-
ఢిల్లీ, గురుగ్రామ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఢిల్లీలోనూ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో చాలా చోట్ల బారికేడ్లు వేశారు. అక్షరధామ్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ ఉంది. గురుగ్రామ్ నుండి ఢిల్లీకి వెళ్లే మార్గంలో ఢిల్లీ పోలీసులు రాజోక్రి సరిహద్దులో బారికేడ్లు వేసి తనిఖీ చేస్తున్నారు.
Heavy traffic jam on Sarhaul border at Delhi-Gurugram expressway as Delhi Police begins checking of vehicles in wake of #BharatBandh against #AgnipathScheme, called by some organisations. pic.twitter.com/1VCo5RcHAJ
— ANI (@ANI) June 20, 2022
భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
-
ఢిల్లీ నుంచి నడిచే 71 రైళ్లు రద్దు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా భారీ నిరసనల కారణంగా అనేక రైళ్లు రద్దు చేసింది రైల్వే శాఖ. రైళ్ల రద్దు కారణంగా చాలా మంది ప్రయాణికులు చిక్కుకుపోవడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్ కమాండోలను మోహరించారు. ఢిల్లీ నుంచి నడిచే 71 రైళ్లను రద్దు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
-
బీహార్‌లో ఈ రోజు కూడా నిలిచిపోయిన రైళ్లు
బీహార్ నుంచి ఈరోజు కూడా రైళ్లు నిలిచిపోయాయి. వివిధ పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునివ్వడంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. నేటికీ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు వేచి చూస్తామని, ఆహారం, నీరు ఇస్తున్న స్టేషన్‌లో ప్రయాణికులు ఉండేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
-
భద్రత కట్టదిట్టం
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భారత్ బంద్ కొనసాగుతోంది. దీంతో పోలీసులు కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్‌లతో పాటు దేశ వ్యాప్తంగా భద్రను మరింత పెంచారు పోలీసులు.
Published On - Jun 20,2022 10:24 AM