Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Japan Earthquake: జపాన్‌ను వణికించిన భారీ భూ ప్రకంపనలు.. ఒక్కసారిగా హడలిపోయిన ప్రపంచ దేశాలు..! ఎందుకో తెలుసా..!

Powerful Magnitude Earthquake: జపాన్‌ను భారీ భూ ప్రకంపం వణికించింది. హోన్‌షు తూర్పు తీరంలో ఒక్కసారిగా భూమిలో ప్రకంపనలు సంభవించడంతో దేశం మొత్తం ఆందోళనకు గురైంది. జపాన్‌లో వచ్చిన ప్రకంపనలు ప్రపంచ దేశాల అలర్ట్ చేసింది.

Japan Earthquake: జపాన్‌ను వణికించిన భారీ భూ ప్రకంపనలు.. ఒక్కసారిగా హడలిపోయిన ప్రపంచ దేశాలు..! ఎందుకో తెలుసా..!
Earthquakes
Follow us
Sanjay Kasula

|

Updated on: May 14, 2021 | 1:09 PM

జపాన్‌ను భారీ భూ ప్రకంపం వణికించింది. హోన్‌షు తూర్పు తీరంలో ఒక్కసారిగా భూమిలో ప్రకంపనలు సంభవించడంతో దేశం మొత్తం ఆందోళనకు గురైంది. రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చినట్లుగా  నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ విభాగం వెల్లడించింది. ఈ ప్రకంపనలు శుక్రవారం ఉదయం 5:28 గంటలకు  సంభవించినట్లుగా పేర్కొంది. ప్రసిద్ధ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రానికి దగ్గరగా ఈ భూకంపం సంభవించినప్పటికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని అక్కడి అధికారిక వర్గాలు వెల్లడిచాయి. అయితే ప్రకంపనల ప్రభావంపై నివేదికలు అందలేదని చెప్పింది.

ఈ నెల ప్రారంభంలో జపాన్ ఈశాన్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) తెలిపింది. భూకంపం కేంద్రం పసిఫిక్ మహాసముద్రంలో 60 కిలోమీటర్ల లోతులో  (37 మైళ్ళ కంటే ఎక్కువ) గుర్తించారు. టోక్యోతో సహా దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని జెఎంఎ తెలిపింది. ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ పేరిట పిలిచే ఈ భూకంప జోన్‌లో జపాన్‌ ఉంది. దీంతో భారీ భూకంపాలు సంభవిస్తాయని ఇప్పటికే చాలాసార్లు అధికారులు ప్రకటించారు. 2011లో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపానికి సునామీ రాగా.. 15వేల మందికి పైగా మృతి చెందారు. అలాగే ఫుకుషిమా అణు కర్మాగార విపత్తుకూ కారణమైంది. అయితే ఇప్పుడు ఎలాంటి నష్టం జరగలేదని అక్కడి అధికారిక వర్గాలు అంటున్నాయి.

ఇవి కూడా చదవండి: బిలియనీర్ బిల్ గేట్స్ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఏం చేస్తాడో తెలుసా.. అతని ఫుడ్ మెనూ ఓసారి చూడండి..

IPL 2021 విజేతగా నిలిచిన కోహ్లీ సేన… ఫైనల్ పోరులో ఢిల్లీ జట్టును చిత్తూగా ఓడించిన ఆర్‌సీబీ.. తేల్చి చెప్పిన రెడ్డిట్ యూజర్..