Sputnik V Vaccine: భారత్ చేరిన రష్యా టీకాలు.. త్వరలోనే అందుబాటులోకి రానున్న స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్..!

దేశంలో వ్యాక్సిన్‌ కొరతను తీర్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నా, అవి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అనే విధంగా తయారైంది.

Sputnik V Vaccine: భారత్ చేరిన రష్యా టీకాలు.. త్వరలోనే అందుబాటులోకి రానున్న స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్..!
Russian Sputnik V Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: May 14, 2021 | 12:04 PM

Sputnik V Vaccine in India: దేశంలో వ్యాక్సిన్‌ కొరతను తీర్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నా, అవి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అనే విధంగా తయారైంది. టీకా కొరతను తీర్చేందుకు విదేశీ కంపెనీలతోనూ చర్చలు జరిపింది కేంద్రం. కొన్ని కంపెనీలు కూడా వ్యాక్సిన్‌ తయారీకి ముందుకొచ్చాయి. అయితే వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు భారత్‌లో అధునాతన BSL 3 ల్యాబ్‌లు ఉన్నాయా ? అనేదే అసలు సమస్య.

వ్యాక్సిన్‌ కొరత తీర్చేందుకు ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. FDA, WHO అనుమతి పొందిన ఓ టీకానైనా దిగుమతి చేసుకోవచ్చని రాష్ట్రాలకు కూడా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. అటు, విదేశీ కంపెనీలు భారత్‌లో వ్యాక్సిన్‌ తయారు చేయడానికి ముందుకొస్తే వెంటనే అనుమతిస్తామని కేంద్రం తెలిపింది. ఫైజర్‌ , మోడెర్నా , జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీలతో చర్చలు కూడా జరిపింది. భారత్‌లో వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ ముందుకొచ్చింది. అటు కోవాగ్జిన్‌ టీకా ఫార్మూలాను ఇతర కంపెనీలకు ఇవ్వడానికి కేంద్రంతో పాటు భారత్‌ బయోటెక్‌ కంపెనీ కూడా సిద్దమని ప్రకటించాయి. అయితే కొవాగ్జిన్‌ ఫార్ములా ఇచ్చేందుకు భారత్‌ బయోటెక్‌ సిద్ధంగా ఉన్నా, టీకా తయారు చేసేందుకు BSL 3 ల్యాబ్స్‌ ఉన్నాయా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

అయితే భారత్‌లో కోవాగ్జిన్‌ ఫార్మూలాను ఉపయోగించి టీకా తయారు చేసే అధునాతన ల్యాబ్‌లు లేవంటున్నారు నీతిఅయోగ్‌ సభ్యుడు వీకేపాల్‌. డిసెంబర్‌ నాటికి భారత్‌కి 216 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. కోవాగ్జిన్‌ టీకా తయారీకీ అధునాతన బీఎస్‌ఎల్‌ 3 ల్యాబ్‌లు అవసరమంటున్నారు. వాటిలో భారత్‌ బయోటెక్‌కు చెందిన సింగిల్‌ డ్రాప్‌, సింగిల్‌ డోస్‌ నాసల్‌ వ్యాక్సిన్లు కూడా (ముక్కు ద్వారా తీసుకునేవి) ఉంటాయని వెల్లడించారు. ఇప్పటివరకు భారత్‌లో దాదాపు 18 కోట్ల డోసులు అందించామని, జులై నాటికి ఈ సంఖ్య 35.6 కోట్లకు చేరుతుందని తెలిపారు. అత్యధిక డోసులు వేసిన దేశాల జాబితాలో అమెరికా, చైనాల తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉందని పాల్‌ వెల్లడించారు.

మరోవైపు, 150 రోజుల్లో ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందిస్తామని తెలిపింది కేంద్రం. డిసెంబర్‌ నాటికి భారత్‌కి 216 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. మరోవైపు వచ్చే వారం స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ కూడా భారత్‌లో రిలీజ్‌ కానుంది. దీంతో పాటు ఆగస్ట్‌ నుంచి డిసెంబర్‌ మధ్యలో మరో ఐదు టీకాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. స్పుత్నిక్‌ వి తర్వాత బయోలాజికల్‌ ఇ, సీరమ్‌ నోవావ్యాక్స్‌, భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌, జెనోవా MRNA వ్యాక్సిన్‌, జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు లుపిన్‌ కూడా వ్యాక్సిన్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో వచ్చే డిసెంబర్‌ నాటికి భారత్‌లో పూర్తి స్థాయిలో టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

త్వరలోనే కొత్త టీకాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మొత్తంగా 200 కోట్లకు పైగా డోసులను సముపార్జించుకోనున్నట్లు తెలిపింది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ వచ్చే వారమే మన దగ్గర విపణిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడించింది. స్పుత్నిక్ వీ టీకా స్థానిక ఉత్పత్తి జూలైలో ప్రారంభమవుతుందని వీకే పాల్ అన్నారు. దాదాపు 15.6 కోట్ల మోతాదులను తయారు చేయవచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ రష్యాకు టీకాకు భారత్‌లోని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ భాగస్వామ్యంతో ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఇక, స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను తొలుత రష్యా గతేడాది ఆగస్టు 11న ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ సామర్థ్యం 91.6 శాతం ఉన్నట్టు Lancet Medical Journalలో ప్రచురితమైంది. 50కి పైగా దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ను వినియోగిస్తున్నారు. ఇప్పటికే టీకాలు మాస్కో నుంచి హైదరాబాద్‌ చేరుకున్నాయి. తొలి విడతలో భాగంగా 1.5 లక్షల వయల్స్‌ భారత్‌కు అందాయి. భారత్‌లో స్పుత్నిక్‌ వి క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌కు చేరాయి.

ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13.76 కోట్ల మంది మొదటి డోసు వేయించుకున్నారు. 3.96 కోట్ల మంది రెండో డోసునూ పొందారు. 45 ఏళ్లు దాటినవారు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది ఉండగా, వారిలో 1/3వ వంతు మందికి ఒక డోసు అందింది. కొవిడ్‌ మృతుల్లో 88% మంది ఈ వయస్సు వారే. వారికి టీకా అందించడంతో మరణాల రేటు తగ్గే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు 35.6 కోట్ల డోసులు కొనుగోలు చేశాం. ఇందులో 19.6 కోట్ల డోసుల వినియోగం ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుంది. మిగిలిన 16 కోట్ల డోసులు మే జులై మధ్యలో అందుతాయి. వాటికి ఇప్పటికే చెల్లింపులు పూర్తయ్యాయి. మరో 16 కోట్ల డోసులను రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు కలిసి సేకరిస్తున్నాయి. మొత్తంగా జులై నాటికి 51.6 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయి.

Read Also…  కొవిడ్ ఎఫెక్ట్..! ఆ గ్రామంలో 25 రోజుల్లో 35 మరణాలు.. 70 శాతం మందికి కరోనా లక్షణాలు..?