Portugal: పోర్చుగల్‌లో సంచలనం.. ప్రభుత్వం ఏర్పాటు దిశగా లెఫ్ట్ సోషలిస్టులు..

పోర్చుగల్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో సెంటర్-లెఫ్ట్ సోషలిస్టులు ఘన విజయం సాధించారు.. కరోనా ఉధృతి ఉన్నప్పటికి ఊహించిన దానికంటే ఎక్కువ భారీ ఓటింగ్ జరిగింది. ఇటీవలి ఒపీనియన్ పోల్స్‌లో సోషలిస్టులకు సరైనా మెజారిటీ రాదని..

Portugal: పోర్చుగల్‌లో సంచలనం.. ప్రభుత్వం ఏర్పాటు దిశగా లెఫ్ట్ సోషలిస్టులు..
Portugal Socialists Win
Follow us

|

Updated on: Jan 31, 2022 | 1:55 PM

పోర్చుగల్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో సెంటర్-లెఫ్ట్ సోషలిస్టులు ఘన విజయం సాధించారు.. కరోనా ఉధృతి ఉన్నప్పటికి ఊహించిన దానికంటే ఎక్కువ భారీ ఓటింగ్ జరిగింది. ఇటీవలి ఒపీనియన్ పోల్స్‌లో సోషలిస్టులకు సరైనా మెజారిటీ రాదని వచ్చినప్పటికి ఎన్నికల్లో మాత్రం విజయం సాధించి అంచనాలు తారుమారు చేశారు. లిస్బన్ – పోర్చుగల్ పాలక సోషలిస్ట్ పార్టీ ఆదివారం జరిగిన ముందస్తు ఎన్నికలలో విజయం సాధించింది. సంకీర్ణాన్ని ఏర్పరచకుండానే పరిపాలించాలనుకున్న మెజారిటీని పొందలేకపోయినప్పటికీ.. పార్లమెంటులో అత్యధిక స్థానాలను గెలుచుకుంది.

మిస్టర్ కోస్టా — పోర్చుగల్ ప్రెసిడెంట్ చేత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుందని భావించారు. కానీ ఫలితాలు బిన్నంగా వచ్చాయి. 230 పార్లమెంట్ సీట్లకుగాను 117 స్థానాలను గెలచుకుని మెజారిటీని సాధించింది. ఈ విజయం పాలక పోర్చుగీస్ ప్రధాని ఆంటోనియోకోస్టాకు సోలోగా పరిపాలించడానికి పూర్తి మెజారిటీని ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు.

పార్టీ కార్యాయం ముందు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పోర్చుగల్ కు పెట్టుబడులు, సంస్కరణలు మరింత తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కోస్టా అన్నారు.  

మిస్టర్ కోస్టా వామపక్ష భాగస్వాముల నుండి ఫిరాయింపులతో కూడిన బడ్జెట్ వివాదం తర్వాత నవంబర్‌లో ముందస్తు ఎన్నికలు జరిగాయి.

ఇవి కూడా చదవండి: Budget 2022: ఆత్మ నిర్భర్‌ భారత్‌లో మహిళల పాత్ర కీలకం.. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ఆలయ ప్రస్తావన

Budget 2022: దేశాభివృద్దికి ఇదే కీలక సమయం.. ప్రతిపక్షాలు సహకరించాలి.. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ