Corona Vaccine: ఆ దేశంలో వ్యాక్సిన్ తప్పని సరి.. పీక్ స్టేజ్‌కు చేరుకున్న ప్రజల ఆందోళనలు .. రహస్య ప్రాతానికి ప్రధాని..
Corona Vaccine: కెనడా(Canada)లో కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు రాజధాని ఒట్టావా(Ottawa)లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు..
Corona Vaccine: కెనడా(Canada)లో కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు రాజధాని ఒట్టావా(Ottawa)లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రధాని జస్టిన్ ట్రూడో సహా ఆయన కుటుంబాన్ని సైన్యం రహస్య ప్రాంతానికి తరలించింది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కట్టడిలో భాగంగా చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం కొవిడ్ వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేయడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. కొవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. తాజాగా కెనడా కూడా కొవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ప్రధాని జస్టిన్ ట్రూడో విధించిన కరోనా నిబంధనలను వ్యతిరేకిస్తూ ‘ఫ్రీడమ్ కాన్వాయ్’ పేరుతో ట్రక్కు డ్రైవర్లు కెనడా రాజధాని ఒట్టావాను చుట్టుముట్టారు. రాష్ట్రాల సరిహద్దులు దాటే ట్రక్కు డ్రైవర్లకు టీకా తప్పనిసరి అనే నిబంధనను అధికారులు అమలు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. మరికొందరు జాతీయ యుద్ధస్మారకం వద్ద నృత్యాలు చేశారు.
దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్తగా ప్రధాని జస్టిన్ ట్రూడో, అతని కుటుంబ సభ్యులను అధికారిక నివాసం నుంచి అజ్ఞాత ప్రదేశానికి తరలించినట్టుగా మీడియాలో కథనాలు వెల్లడించాయి. ఈ చర్యలను కెనడా అత్యున్నత సైనికాధికారి జనరల్ వేన్ ఐర్, కెనడా రక్షణ మంత్రి అనితా ఆనంద్ ఖండించారు. తీవ్రమైన శీతల వాతావరణ హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా వందలాది మంది నిరసనకారులు పార్లమెంటరీ ఆవరణలోకి రావడంతో.. ఈ ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
Also Read: