Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pneumonia: మనవాళిపై పగబట్టిన వైరస్!.. న్యుమోనియా బారిన పడుతున్న చైనాలో చిన్నారులు .. తాత్కాలికంగా స్కూల్స్ మూసివేత

చైనాలో కోవిడ్-19 నియంత్రణ కోసం విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతో ఇన్‌ఫ్లుఎంజా, మైకోప్లాస్మా న్యుమోనియా (సాధారణంగా చిన్న పిల్లలను ప్రభావితం చేసే ఒక సాధారణ బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్), శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ వంటి అంటువ్యాధులు ప్రబలుతున్నాయని వ్యాధికారక వ్యాప్తికి చైనా అధికారులు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆస్పత్రుల వద్ద చిన్నారులు, తమ కుటుంబ సభ్యులతో క్యూ కట్టిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 

Pneumonia: మనవాళిపై పగబట్టిన వైరస్!.. న్యుమోనియా బారిన పడుతున్న చైనాలో చిన్నారులు .. తాత్కాలికంగా స్కూల్స్ మూసివేత
Pneumonia Outbreak
Follow us
Surya Kala

|

Updated on: Nov 23, 2023 | 9:50 AM

చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ లక్షల మందిని బలితీసుకుంది. ఈ మహమ్మారి మిగిల్చిన విషాదం నుంచి మానవాళి ఇంకా కోలుకోక ముందే చైనాలో మరో ప్రాణాంతక వైరస్ విజృంభిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో స్కూల్ స్టూడెంట్స్ న్యుమోనియా బారిన పడుతున్నారని.. ఈ వ్యాధి బారిన పడినవారు అంతుచిక్కని లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా ప్రోమెడ్‌ సంస్థ అప్రమత్తం చేసింది.

బీజింగ్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో న్యుమోనియా వ్యాప్తి పెరగడంతో చైనీస్ ఆసుపత్రులు “బాధిత చిన్నారులతో నిండిపోయాయి”. చిన్నారులు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌, శ్వాససంబంధ ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు ఈ అంటువ్యాధి మరింత ప్రబలకుండా తాత్కాలికంగా స్కూల్స్ కు సెలవులు ఇచ్చారు. అదే సమయంలో ఈ లక్షణాలు స్కూల్ టీచర్స్ లో కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

అయితే  చైనాలో కోవిడ్-19 నియంత్రణ కోసం విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతో ఇన్‌ఫ్లుఎంజా, మైకోప్లాస్మా న్యుమోనియా (సాధారణంగా చిన్న పిల్లలను ప్రభావితం చేసే ఒక సాధారణ బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్), శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ వంటి అంటువ్యాధులు ప్రబలుతున్నాయని వ్యాధికారక వ్యాప్తికి చైనా అధికారులు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆస్పత్రుల వద్ద చిన్నారులు, తమ కుటుంబ సభ్యులతో క్యూ కట్టిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

పూర్తి వివరాలు కోరిన డబ్ల్యూహెచ్‌వో

ఉత్తర చైనాలో గత మూడు సంవత్సరాలలో ఇదే కాలంతో పోలిస్తే అక్టోబరు మధ్య నుండి ఇన్‌ఫ్లుఎంజా వంటి అంటువ్యాధులు పెరిగాయని WHO తెలిపింది. అనారోగ్యం, వ్యాధి లక్షణాలు, చిన్నారులు ఉండే ప్రాంతాల పూర్తి సమాచారాన్ని ఇవ్వమని చైనా ప్రభుత్వాన్ని కోరింది. WHO అదనపు సమాచారాన్ని కోరుతూ టీకాతో సహా శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి చైనాలోని ప్రజలు నివారణ చర్యలను అనుసరించాలని సిఫార్సు చేస్తోంది. వ్యాధి బారిన పడిన వ్యక్తులను దూరం ఉంచడం.. అవసరమైన పరీక్షలు నిర్వహించడం, వైద్య సంరక్షణ పొందడం, మాస్క్ లు ధరించడం , మంచి గాలి వెలుతురు వచ్చే ప్రాంతాల్లో నివసించడం, చేతులను తరచుగా శుభ్రపరచుకోవడం వంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..