AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Hamas War: హమాస్ వద్ద బందీగా ఉందనుకున్నారు.. 47 రోజుల తర్వాత శవమై దొరికిన యువతి

షాని మరణం పట్ల యోకానిమ్ మేయర్ సైమన్ అల్ఫాసి సంతాపం వ్యక్తం చేస్తూ షానీ ఇక ఈ లోకంలో లేదనే విషయం  నమ్మలేకపోతున్నానని అన్నారు. షాని తిరిగి వస్తుందని 47 రోజులుగా ఎదురు చూస్తున్నామని.. అయితే షాని  మృత దేహం చూసిన తర్వాత ఆ ఆశ కూడా తీరిపోయిందని అన్నారు. ఆమె కోసం ఎదురుచూస్తున్న మేము ఇప్పుడు చేదు వార్త వినాల్సి వచ్చిందని చెప్పారు.  

Israel Hamas War: హమాస్ వద్ద బందీగా ఉందనుకున్నారు.. 47 రోజుల తర్వాత శవమై దొరికిన యువతి
Shani Gabay
Surya Kala
|

Updated on: Nov 23, 2023 | 1:12 PM

Share

హమాస్ అక్టోబర్ 7న గాజా సరిహద్దు సమీపంలో ఒక సంగీత ఉత్సవంపై దాడి చేసిన తరువాత.. హమాస్ పట్టుకున్న బందీలలో ఒకరిగా భావించిన 25 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళ మృతదేహం గురువారం కనుగొనబడినట్లు నివేదికలు తెలిపాయి. షానీ గబాయ్ పనిచేస్తున్న సూపర్‌నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌ సమీపంలో కాలిపోయిన అంబులెన్స్‌ కింద షానీ మృతదేహం కనిపించిందని నివేదికలు తెలిపాయి. షాని మరణం పట్ల యోకానిమ్ మేయర్ సైమన్ అల్ఫాసి సంతాపం వ్యక్తం చేస్తూ షానీ ఇక ఈ లోకంలో లేదనే విషయం  నమ్మలేకపోతున్నానని అన్నారు. షాని తిరిగి వస్తుందని 47 రోజులుగా ఎదురు చూస్తున్నామని.. అయితే షాని  మృత దేహం చూసిన తర్వాత ఆ ఆశ కూడా తీరిపోయిందని అన్నారు. ఆమె కోసం ఎదురుచూస్తున్న మేము ఇప్పుడు చేదు వార్త వినాల్సి వచ్చిందని చెప్పారు.

దీనితో పాటు సైమన్ అల్ఫాసి కూడా షానీ కుటుంబానికి సానుభూతి తెలిపారు. షానీ తల్లిదండ్రులు జాకబ్, మిచల్ లతో పాటు సోదరుడు అవియెల్, అతని సోదరి నిట్జాన్‌లకు తన సంతాపాన్ని తెలిపారు. షానిని కనుగొని ఇంటికి తీసుకురావడానికి.. ఏడు వారాలుగా అన్ని విధాలుగా అధికారులు ప్రయత్నించారని తెలిపారు. వాస్తవానికి షాని కుటుంబం ఏదొక రోజు తమ కుమార్తె ఇంటికి తిరిగి వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే ఇప్పుడు తమ కుమార్తె మరణించింది అన్న వార్త తెలిసింది. ఇది నమ్మడం కష్టంగా ఉందంటూ కన్నీరు పెడుతున్నారు. గబే ఇటీవలి లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వచ్చే వారం 26 ఏళ్లు పూర్తీ చేసుకుని 27వ ఏట అడుగు పెట్టనున్నదంటూ గుర్తుచేసుకున్నారు.

అక్టోబరు 7 నుంచి కనిపించకుండా షానీ గాబే

అక్టోబర్ 7న కిబ్బట్జ్ రీమ్‌లో జరిగిన సంగీత కచేరీలో షాని పనిచేస్తుంది. అదే సమయంలో హమాస్ ఉగ్రవాదులు సంగీతోత్సవంపై దాడి చేశారు. ఈ సమయంలో చుట్టూ గందరగోళం నెలకొంది. ఈ ఉగ్రదాడిలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఉగ్రవాదులు చిన్నారులతో సహా 240 మందికి పైగా బందీలుగా ఉన్నారు. ఈ సమయంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం దాడి చేసిన సమయంలో షానీని కూడా ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. తర్వాత ఆమెను హత్య చేసినట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్‌తో హమాస్ ఒప్పందం

తాజాగా కొంతమంది బందీలను విడుదల చేయడానికి ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం హమాస్ 50 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనుంది. ఈ బందీలను 4 రోజుల కాల్పుల విరమణకు బదులుగా తమ దగ్గర ఉన్న బందీల్లో 50మందిని విడుదల చేస్తారు. ఈ బందీలలో ఎక్కువ మంది అక్టోబర్ 7 నుండి హమాస్ చెరలో ఉన్న పిల్లలు. ప్రతిరోజూ 12-13 మంది బందీలను హమాస్ విడుదల చేయనుందని వెల్లడించింది. అదే సమయంలో ఇజ్రాయెల్ తన జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనా మహిళలు, పిల్లలను కూడా విడుదల చేయాల్సి ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం