AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుదీర్ఘకాలం తర్వాత డబ్యూహెచ్ఓ నుంచి తీపికబురు.. కరోనా అంతానికి కలలు కనొచ్చు.. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరి అంతానికి 'కలలు కనే సమయం వచ్చిందని' ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పలు దేశాలు చేస్తున్న కరోనా వ్యాక్సిన్లు

సుదీర్ఘకాలం తర్వాత డబ్యూహెచ్ఓ నుంచి తీపికబురు.. కరోనా అంతానికి కలలు కనొచ్చు.. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
Rajitha Chanti
|

Updated on: Dec 05, 2020 | 4:26 PM

Share

Jeneva: ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరి అంతానికి ‘కలలు కనే సమయం వచ్చిందని’ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పలు దేశాలు చేస్తున్న కరోనా వ్యాక్సిన్లు ఆశించిన ఫలితాలు ఇస్తున్న క్రమంలో డబ్ల్యూహెచ్ఓ ఈ ప్రకటన చేసింది. కరోనా వైరస్ మొదలై ఏడాది పూర్తైనా, ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా జీవితాంతం మనతోనే ఉంటుందని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ వచ్చింది. పలు దేశాలు కరోనా వ్యాక్సిన కోసం కృషి చేస్తున్నా డబ్ల్యూహెచ్ఓ మాత్రం ఎప్పుడూ సానుకూలంగా స్పంధించలేదు. తాజాగా కరోనాపై డబ్ల్యూహెచ్ఓ చేసిన ప్రకటన ఆశాజనకంగా ఉంది.

కరోనా వ్యాక్సిన్ విషయంలో పేద దేశాలపై ధనిక దేశాలు ఆధిపత్యం ప్రదర్శించరాదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. కరోనా అంతానికి సమయం వచ్చినా.. అందుకు వెళ్తున్నా మార్గాలే కొంత అనుమానంగా ఉన్నాయన్నారు. అలాగే పరోక్షంగా పేద దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంపై సందేహాలను వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మంచితోపాటు చెడును కూడా తీసుకువచ్చిందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలు త్యాగం, శాస్త్ర విజ్ఞాన శక్తి, మనసులను కదిలించిన సంఘీభావాలు అందరికీ స్పూర్తిగా నిలిస్తే.. స్వార్థం, విభజన, పరస్పర నిందారోపణలను మనసును కలిచివేయన్నారు. ఐక్యరాజ్య సమితి కరోనాపై నిర్వహించిన తొలి ఉన్నతస్థాయి సమీక్షలో అధనామ్ పాల్గొన్నారు.

కరోనా వ్యాక్సిన్ ప్రపంచంలో పేదరికం, ఆకలి, ఆర్థిక స్థితిగతులపై ఎలాంటి మార్పులు చూపించలేదని అధనామ్ వ్యాఖ్యనించారు. కరోనా అంతం తర్వాత దేశాధినేతలు ఈ సవాళ్ళపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఉత్పత్తి, వినియోగం పట్ల ఇప్పటివరకు ఏకచ్ఛత్రాధిపత్యం, ప్రకృతి సమతుల్యతను కాపాడడం పట్ల ఉన్న నిర్లక్ష్య దోరణిని, అనవసరపు జోక్యాలు, రాజకీయాలు చేయవద్దని సూచించారు.

వ్యాక్సిన్‏ను ప్రైవేట్ వినియోగ వస్తువుగా చూడొద్దని, వ్యాక్సిన్ ప్రతీ ఒక్కరికి అందుబాటులోకి వచ్చే విధంగా పంపిణీ చేయాలని అధనామ్ సూచించారు. వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి డబ్ల్యూహెచ్ఓ ఏసీటీ-ఆక్సిలరేటర్ కార్యక్రమానికి మరిన్ని నిధులు అవసరమని, లేకపోతే ఒక ఉన్నత లక్ష్యం నీరుగారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వెంటనే 4.3 బిలియన్ డాలర్లు అవసరం ఉందని.. 2021లో మరో 23.98 బిలియన్ డాలర్లు అవసరమని ఉంటాయని తెలిపారు. కరోనా మొదలైన తర్వాత జీ20 దేశాలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల్లో కేవలం 0.005 శాతమేనని తెలిపారు.