కరోనాతో కిడ్నీ పేషంట్లకు మరింత ముప్పు… సంచలన విషయాలు వెల్లడించిన అమెరికన్ వైద్యులు…

అమెరికాకు చెందిన గిసిన్జర్ మెడికల్ కాలేజీ ఇటీవల ఒక కొత్త పరిశోధన చేసింది. అందులో భాగంగా మూత్రపిండ వ్యాధిగ్రస్తుల్లో కరోనా తీవ్ర ఎలా ఉంటుందనే విషయాన్ని పరిశోధనా పూర్వకంగా తెలుసుకున్నారు.

కరోనాతో కిడ్నీ పేషంట్లకు మరింత ముప్పు... సంచలన విషయాలు వెల్లడించిన అమెరికన్ వైద్యులు...

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచమంతా పోరాడుతోంది. వ్యాక్సిన్ తయారీకి అన్ని దేశాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కరోనా వచ్చాక తీసుకునే జాగ్రత్తల కంటే రాకుండా అరికట్టే చర్యలే మేలని వైద్యులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. వ్యాక్సిన్ రావడం లేటైనా… ముందస్తు చర్యలు, కరోనా పాజిటివ్ వచ్చాక తీసుకునే జాగ్రత్తల గురించి మనం వింటునే ఉన్నాం.

ఇతర వ్యాధుల కారణంగా… కరోనా మరింత తీవ్రంగా…

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యుల విశ్లేషణల ప్రకారం ఆరోగ్యంగా ఉన్న వారికి కరోనా వస్తే కోలుకుంటున్నారని తెలుపుతున్నారు. అదే సమయంలో హృదయ రోగులు, రక్తపోటు, మధుమేహం ఉన్న వారికి ఒకవేళ కరోనా వస్తే వారు కోలుకోవడానికి చాలా సమయం పడుతోందని, వారిని కరోనా కాటు వేసే అవకాశాలు అధికంగా ఉంటున్నాయని తెలుపుతున్నారు.

మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు కరోనాతో మరింత ముప్పు….

అమెరికాకు చెందిన గీసిన్జర్ మెడికల్ కాలేజీ ఇటీవల ఒక కొత్త పరిశోధన చేసింది. అందులో భాగంగా మూత్రపిండ వ్యాధిగ్రస్తుల్లో కరోనా తీవ్ర ఎలా ఉంటుందనే విషయాన్ని పరిశోధనా పూర్వకంగా తెలుసుకున్నారు. మార్చి 7 నుంచి మే 19 మధ్య కొందరు కొవిడ్ బాధితులపై ప్రయోగాలు చేశారు. వారిలో కొందరికి కేవలం కొవిడ్ లక్షణాలు ఉండగా… మరికొందరిని మెరుగైన చికిత్స అవసరమై ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చేరిన రోగుల మెడికల్ రిపోర్టులను పూర్తిగా స్టడీ చేశారు.

మూత్రపిండాల పనితీరు, రక్తప్రసరణ, శరీర ప్రతిస్పందన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, ఆస్పత్రిలో చేరిన వారిలో అందరి కంటే మూత్రపిండ సంబంధ వ్యాధులు ఉన్న వారిపై కరోనా ప్రభావం అధికమని వారి పరిశోధనలో తేలింది. దాదాపు 11 రెట్లు కరోనా అధికంగా ఉండిందని గీసిన్జర్ మెడికల్ కాలేజీ వైద్యులు అలెక్స్ చాంగ్ తెలిపారు. హృదయ రోగులు, రక్తపోటు, మధుమేహం, ఒత్తిడి కంటే కూడా మూత్రపిండాల వ్యాధి కరోనా రోగులపై ప్రతికూల ప్రభావాన్ని అధికంగా చూపుతుందని ఆ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ తురజ్ మిర్సాహి అన్నారు.

 

Click on your DTH Provider to Add TV9 Telugu