వీడు మాయగాడు, మహా మోసగాడు.. ఫేస్‌బుక్‌లో ప్రేమ పేరుతో అందమైన అమ్మాయిలకు ఎర.. అనంతరం..
ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిలను పరిచయం చేసుకొని, ప్రేమ పేరుతో వలపు బాణాలు వేసి, వల్లో వేసుకొని డబ్బులు గుంజడం ఇతడి పని.
ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిలను పరిచయం చేసుకొని, ప్రేమ పేరుతో వలపు బాణాలు వేసి, వల్లో వేసుకొని డబ్బులు గుంజడం ఇతడి పని. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు ఈ నీచుడు. ఇవి ఎవరో అన్నమాటలు కావు.. స్వయానా కట్టుకున్న భార్యచెప్పినవే. ఈ ఛీటర్ ఆగడాలకు విసిగి వేజారిన భార్య తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇతగాడి బాగోతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన కుర్ర విజయభాస్కర్ 2017లో సౌజన్య అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం నిత్యం భార్యను వేధించసాగాడు. పెళ్లి సమయంలో 25 తులాల బంగారం, రూ.15 లక్షల కట్నం సమర్పించారు. అయితే తాజాగా తన మేనకోడలిపై కన్నేసిన ఇతడు మరోపెళ్లి చేసుకుంటానని భార్యను వేధిస్తున్నాడు. ‘తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగినని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకొని మూడేళ్లుగా ఇబ్బందిపెడుతున్నాడని పోలీసుల ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది సౌజన్య’ వీరిద్దరికి మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే విజయ్ భాస్కర్‌కు మరో కళ కూడా ఉంది. ఫేస్‌బుక్ వేదికగా అమ్మాయిలకు ప్రేమ పేరుతో గాలం వేసి లొంగదీసుకుంటాడు. అనంతరం వారి దగ్గరి నుంచి డబ్బులు గుంజుతాడు. ఇప్పటికి ఆరుగురు అమ్మాయిలను మోసం చేసి డబ్బులు కాజేసినట్లు తెలుస్తోంది. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్ భాస్కర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.