నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం.. జనం పైకి దూసుకెళ్లిన కారు ఒకరు మృతి..నలుగురికి గాయాలు

నిజామాబాద్ జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగం దూసుకువచ్చిన కారు జనాన్ని ఢీ కొట్టడంతో ... ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం.. జనం పైకి దూసుకెళ్లిన కారు ఒకరు మృతి..నలుగురికి గాయాలు
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 05, 2020 | 4:24 PM

నిజామాబాద్ జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగం దూసుకువచ్చిన కారు జనాన్ని ఢీ కొట్టడంతో..ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భీంగల్‌ మండలం బడాభీంగల్‌ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. బైక్‌ను ఢీ కొని ముందున్న ఓ హోటల్‌లోకి కారు దూసుకెళ్లింది. దాంతో హోటల్‌ ముందున్న మరికొందరు కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పుప్పల చిన్నరాజన్న అనే వ్యక్తి మృతిచెందాడు. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రమాదానికి అతివేగం కారణమని స్థానికులు తెలిపారు. అయితే ప్రమాదానికి ముందు ఇద్దరు చిన్నారులు అదే ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్లారు. వారు వెళ్లిన కొద్ది సెకన్లకే ఈ ప్రమాదం జరిగింది.