ప్రముఖ నవల ఆధారంగా క్రిష్ సినిమా.. ఇంట్రస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్న చిత్రయూనిట్

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా అడ్డు రావడం , పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ గ్యాప్ లో క్రిష్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించాడు.

ప్రముఖ నవల ఆధారంగా క్రిష్ సినిమా.. ఇంట్రస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్న చిత్రయూనిట్
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 05, 2020 | 4:04 PM

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా అడ్డు రావడం , పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ గ్యాప్ లో క్రిష్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమాను తెరకెక్కించాడు. రకుల్ ప్రీత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు క్రిష్. ఈ మూవీకి ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనుకుంటున్నారని ఫిలిం నగర్లో టాక్ నడుస్తుంది.

ఈ సినిమాను ‘కొండపొలం’ అనే నవల ఆదారంగా తెరకెక్కించారట. ఇక సినిమాకు కూడా ‘కొండపోలం’ అనే టైటిల్ నే పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. గొర్రెల మందను అడవిలోకి తీసుకుపోయిన ఓ బృందం అనుకోనుండా ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఉంటుందని సమాచారం. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాజీవ్‌ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు పవన్ ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసిన వెంటనే క్రిష్ సినిమా మొదలుపెట్టనున్నాడు. అటు వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ‘ఉప్పెన’ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.