నాలుగేళ్ల తర్వాత జియోను అధిగమించిన ఎయిర్‌‌టెల్.. ఇది ఇలాగే కొనసాగితే తప్పకుండా నెంబర్‌వన్‌కు..

ఎప్పుడైతే మార్కెట్‌లోకి రిలయన్స్ జియో అడుగు పెట్టిందో అప్పటి నుంచి టెలికాం సంస్థలన్ని కుదేలయ్యాయి.

నాలుగేళ్ల తర్వాత జియోను అధిగమించిన ఎయిర్‌‌టెల్.. ఇది ఇలాగే కొనసాగితే తప్పకుండా నెంబర్‌వన్‌కు..
Follow us
uppula Raju

|

Updated on: Dec 05, 2020 | 3:43 PM

ఎప్పుడైతే మార్కెట్‌లోకి రిలయన్స్ జియో అడుగు పెట్టిందో అప్పటి నుంచి టెలికాం సంస్థలన్ని కుదేలయ్యాయి. మార్కెట్‌లోకి 4జి ఇంటర్నెట్ సేవలు ఉచింగా తీసుకొచ్చి మిగతా టెలికాం సంస్థ ల వినియోగదారులు, చందాదారులను తనవైపు తిప్పేసుకుంది. ప్రస్తుతం టెలికాం మార్కెట్లో అత్యధిక కస్టమర్లను కలిగి వుండి ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తోంది. అయితే ఇప్పుడు జీయోకి దేశీ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ చెక్ పెట్టబోతుంది. నాలుగేళ్ల తర్వాత మొదటిసారి జియోను అధిగమించి తన వినియోగదారులను పెంచుకుంది. దీంతో ఎయిర్‌టెల్ ఒక్కసారిగా అందరిని ఆకర్షించింది.

ఎయిర్‌టెల్ సెప్టెంబర్‌లో జియో కంటే రెట్టింపు స్థాయిలో కొత్త కస్టమర్లను సంపాదించుకుంది. ఎయిర్‌టెల్ మొత్తం 38 లక్షల కొత్త చందాదారులను సంపాదించకోగా జియో కేవలం 15 లక్షల మందిని మాత్రమే సాధించుకోగలిగింది.ఈ వృద్ధితో ఎయిర్‌టెల్ నాలుగేళ్ల తర్వాత ఈ ఘనత సాధించింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపిన నిర్ణయం ప్రకారం.. ఎయిర్‌టెల్ వరుసగా రెండో నెల జియోను అధిగమించి కొత్త వినియోగదారులను సాధించుకోగా, మరో దిగ్గజం వొడాఫోన్ ఐడియా ఉన్న కస్టమర్లను పోగొట్టుకుంది. సెప్టెంబర్ చివరి నాటికి రిలయన్స్ జియో కొత్తగా 0.36 మందిని పెంచుకొని 40.41 కో ట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఎయిర్‌టెల్ 1.17 శాతం కస్టమర్లు పెరిగి 32.66 కోట్ల వినియోగదారులను కలిగి ఉంది. వోడాఫోన్ 47 లక్షల వినియోగదారులను పోగొట్టుకొని 29.55 కోట్లకు తగ్గింది. ఇది ఇలానే కొనసాగితే త్వరలోనే జియోను అధిగమించి నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటామని ఎయిర్‌టెల్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.