AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రుడిపై జాతీయ జెండాను పాతిన చైనా, ఫోటోలను విడుదల చేసిన జాతీయ అంతరిక్ష కేంద్రం

చంద్రుడిపై చైనా తన జాతీయ జెండాను పాతింది.. అందుకు సంబంధించిన ఫోటోలను డ్రాగన్‌ దేశం విడుదల చేసింది. అమెరికా తర్వాత చందమామపై జెండాను పాతిన దేశం చైనానే!

చంద్రుడిపై జాతీయ జెండాను పాతిన చైనా, ఫోటోలను విడుదల చేసిన జాతీయ అంతరిక్ష కేంద్రం
Balu
|

Updated on: Dec 05, 2020 | 1:51 PM

Share

చంద్రుడిపై చైనా తన జాతీయ జెండాను పాతింది.. అందుకు సంబంధించిన ఫోటోలను డ్రాగన్‌ దేశం విడుదల చేసింది. అమెరికా తర్వాత చందమామపై జెండాను పాతిన దేశం చైనానే! చాంగే-5 ల్యాండర్‌కు ఉన్న కెమెరా ఈ ఫోటోను తీసింది.. సుమారు 50 ఏళ్ల కిందట అమెరికా తమ జాతీయ జెండాను జాబిల్లిపై పాతింది.. మళ్లీ ఇంత కాలానికి చైనా ఆ పని చేసింది.. చంద్రుడి ఉపరితంపై నమూనాలను సేకరించడానికి వెళ్లిన చైనా స్పేస్‌ షిప్‌ అక్కడ తమ జాతీయ జెండాను అమర్చింది.. ఎగరేయడానికి, జెండాను రెపరెపలాడించడానికి అక్కడ గాలి ఉండదు కాబట్టి నిశ్చలంగా ఉన్న జెండాను చూసి మురిసిపోయింది చైనా.. రెండు మీటర్ల వెడల్పు, 90 సెంటిమీటర్ల పొడవు ఉన్న ఈ జెండా ఫోటోలను చైనా జాతీయ అంతరిక్ష కేంద్రం విడుదల చేసింది. చంద్రుడి మట్టిని సేకరించి తిరిగి భూమ్మీదకు బయలుదేరే ముందు చాంగే-5 చైనా జెండాను చంద్రుడి ఉపరితలంపై పాతింది. చంద్రుడు నుంచి ఇప్పటికే అమెరికా, సోవియట్‌ యూనియన్‌ దేశాలు మట్టిని తీసుకొచ్చాయి.. ఇప్పుడా వరుసలో చైనా నిలిచింది. చంద్రుడి మీదకు మనుషులను పంపాలనుకుంటున్న చైనా 2030 నాటికి అంగారక గ్రహం నుంచి కూడా మట్టిని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్