World News: అదే పనిగా టీవీ చూస్తున్న కొడుకు.. తిక్క కుదిర్చేందుకు విచిత్రమైన పనిష్మెంట్ ఇచ్చిన పేరెంట్స్
చిన్నారులు టీవీ చూడడం అనేది సర్వసాధారణమైన విషయం. అయితే ఇది ఇటీవల మరింత ఎక్కువైంది. స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావడం, టీవీల్లో కార్టూన్ షోలు ఎక్కువ కావడంతో గంటల తరబడి చిన్నారులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎంతలా అంటే హోం వర్క్‌ను పక్కన పెట్టి మరీ..
చిన్నారులు టీవీ చూడడం అనేది సర్వసాధారణమైన విషయం. అయితే ఇది ఇటీవల మరింత ఎక్కువైంది. స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావడం, టీవీల్లో కార్టూన్ షోలు ఎక్కువ కావడంతో గంటల తరబడి చిన్నారులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎంతలా అంటే హోం వర్క్‌ను పక్కన పెట్టి మరీ టీవీలు చూస్తున్నారు. సాధారణంగా చిన్నారులు ఇలా చెప్పిన మాట వినకుండా టీవీ చూస్తే పేరెంట్స్ ఏం చేస్తారు.? కేబుల్ కట్ చేయడమో, పరీక్షలు అయ్యేంత వరకు టీవీని అటకుపైన పెట్టడమే లాంటివి చేస్తుంటారు. అయితే చైనాకు చెందిన పేరెంట్స్ మాత్రం తమ ఎనిదేళ్ల చిన్నారికి విచిత్రమైన పనిష్మెంట్ ఇచ్చారు. ఇంతకా ఆ విచిత్రమైన పనిష్మెంట్ ఏంటనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
చైనాకు చెందిన ఓ జంట తమ 8 ఏళ్ల కుర్రాడిని ఇంట్లో ఉంచి పని మీద బయటకు వెళ్లారు. బయటకు వెళ్లే సమయంలోనే టీవీ చూడొద్దని, తాము తిరిగి ఇంటికి వచ్చేలోపు హాం వర్క్ పూర్తి చేసుకోవాలని చెప్పి వెళ్లారు. అయితే ఆ కుర్రాడు మాత్రం పేరెంట్స్ చెప్పిన మాటను పెడచెవిన పెట్టాడు. హోం వర్క్‌ను పక్కన పెట్టేసి టీవీ చూస్తూనే ఉన్నాడు. ఇంతలోనే ఇంటికి వచ్చిన పేరెంట్స్ ఆ విషయాన్ని గుర్తించారు. కొడుకు హోం వర్క్ చేయకుండా టీవీ చూశాడని తెలుసుకొని ఓ విచిత్ర పనిష్మెంట్‌ను విధించారు.
రాత్రంతా కూర్చొని టీవీ చూడమని ఆదేశించారు. అదేంటి టీవీ చూడడం పనిష్మెంట్ ఎలా అవుతుంది అని అనుకుంటున్నారా.? అక్కడే ఉంది లాజిక్.. ఆ కుర్రాడు కాసేపు హాయిగా టీవీ చూస్తూ ఎంజాయ్ అయితే చేశాడు కానీ ఎక్కువ సేపు నిద్రపోకుండా ఉండలేకపోయాడు. దీంతో కాసేపటికే ఏడవడం మొదలు పెట్టాడు. ఉదయం 5 గంటల వరకు కునుకులేకుండా బలంతంగా టీవీని చూపించారు. మరి ఈ పనిష్మెంట్‌తో ఆ కుర్రాడిలో మార్పు వచ్చిందో రాలేదో మాత్రం తెలియరాలేదు. అయితే పేరెంట్స్ విధించిన ఈ పనిష్మెంట్‌పై మాత్రం కొందరు నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. అంత చిన్న కుర్రాడిపై ఇలా వ్యవహరించడం సరైంది కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..