Champions Trophy: టీమిండియా ఫ్యాన్స్‌కు మరో షాకింగ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి జస్సీ ఔట్?

Jasprit Bumrah injured before Champions Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసింది. భారత జట్టు 3-1 తేడాతో ఈ సిరీస్‌ని కోల్పోయింది. అయితే, టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడడం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో బుమ్రా ఆడడంపై సందేహం నెలకొంది.

Champions Trophy: టీమిండియా ఫ్యాన్స్‌కు మరో షాకింగ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి జస్సీ ఔట్?
Jasprit Bumrah
Follow us
Venkata Chari

|

Updated on: Jan 05, 2025 | 10:46 AM

Jasprit Bumrah injured before Champions Trophy: సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా రెండో సెషన్‌లో మైదానాన్ని వీడాడు. రెండో సెషన్‌లో బుమ్రా ఒక్క ఓవర్ మాత్రమే వేయగలిగాడు. అనంతరం స్కానింగ్‌ నిమిత్తం స్టేడియం నుంచి ఆస్పత్రికి తరలించారు. ఇది భారత అభిమానులకు పెద్ద షాక్. ఎందుకంటే బుమ్రా లేకుండా, భారత బౌలింగ్ చాలా బలహీనంగా మారింది.

రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసేందుకు బుమ్రా మైదానానికి రాకపోవడంతో భారత జట్టు ఆందోళన మరింత పెరిగింది. నిజానికి, బుమ్రాకు వెన్ను సమస్య ఉంది. అందుకే అతను బౌలింగ్‌కు పూర్తిగా ఫిట్‌గా లేడు. బుమ్రా ఇంతకు ముందు ఇలాంటి ఇబ్బందులకు గురయ్యాడు. కాబట్టి, అతని విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. సిడ్నీ టెస్ట్ మూడో రోజు ప్రారంభానికి ముందు బుమ్రా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, విజయం సాధించలేకపోయాడు. వార్మప్ సమయంలో, బుమ్రా చాలా తక్కువ రన్‌అప్‌తో బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, అతను అందులో విజయం సాధించలేదు. ఆ తర్వాతే రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి ఔట్?

ఇప్పుడు అతని గాయం వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత ఆందోళనను మరింత పెంచుతుంది. బుమ్రా గాయానికి సంబంధించి బీసీసీఐ ఇంకా అధికారికంగా ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. కానీ, రెండవ రోజు ముగిసిన తర్వాత, బుమ్రా వెన్నులో ఎలాంటి సమస్య లేదని ప్రసిద్ధ్ కృష్ణ చెప్పాడు. అతని స్కానింగ్ రిపోర్టు బయటకు వచ్చినా.. బయటకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అతను బౌలింగ్ చేయకపోవడం అతని గాయం మరింత తీవ్రంగా మారకుండా నిరోధించడానికి తీసుకున్న నిర్ణయం కావొచ్చు అని తెలుస్తోంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కావడానికి ఇంకా మంచి సమయం ఉంది. అయితే, అంతకంటే ముందు బుమ్రాకు ఎలాంటి గాయం అవుతుందో చూడాల్సి ఉంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు అతడు దూరం కావడం ఖాయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..